Donald Trump: ఒకే ఒక ఓటు... అభాసుపాలైన ట్రంప్.. ఆ ఒక్క ఓటు ఎవరు వేశారో తెలుసా.?
ఈ క్రమంలోనే అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ తెరపైకి వచ్చి నవ్వులపాలయ్యారు. స్పీకర్ పదవి పోటీకి ఆయన పేరును నామినేట్ చేయగా.. కేవలం ఒకే ఒక్క ఓటు రావడం గమనార్హం. మొత్తం 430 మంది సభ్యులన్న ప్రతినిధుల సభలో ఒక్కటే ఓటు వచ్చినట్లు ప్రకటించగా సభలోని సభ్యులంతా పగలబడి నవ్వారు.
చదవండి: ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?
స్పీకర్‌గా సేవలందించాలనుకునే వ్యక్తులను సభ ఎన్నుకుటుంది. కాంగ్రెస్‌లో సభ్యులు కాకపోయినా పోటీ పడొచ్చు. ఈ నిబంధన నేపథ్యంలో మెకార్థీని ప్రత్యర్థి వర్గం డొనాల్డ్ ట్రంప్ పేరును నామినేట్ చేసింది. అయితే, ఆయనకు ఒకే ఓటు వచ్చింది. ఆ ఒక్క ఓటు సైతం ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ సభ్యుడు మాట్ గేట్జ్ వేశారు. ఆయన మెకార్థీని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. 11వ రౌండ్ ఓటింగ్ నిర్వహించే క్రమంలో ట్రంప్ పేరును ఆయన నామినేట్ చేశారు. ప్రతినిధుల సభకు ట్రంప్‌ను స్పీకర్‌ని చేయాలన్న కోరికకన్నా.. మెకార్థీని స్పీకర్ కాకుండా చేయాలన్న లక్ష్యమే ఇందులో ఎక్కువగా కనిపిస్తోందని సభ్యులు మాట్లాడుకుంటున్నారు.
చదవండి: ఏపీలో మహిళా ఓటర్లే ఎక్కువ... మొత్తం ఓటర్లు 4 కోట్లు... పూర్తి వివరాలు
ఆశ్చర్యకరంగా ఈ సంఘటనను తనకు అనువుగా మలుచుకునే ప్రయత్నం చేశారు డొనాల్డ్ ట్రంప్. అధ్యక్షుడు జో బైడెన్ ను వెనక నుంచి వెక్కిరిస్తున్నట్లు ఉన్న ఓ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు.. అమెరికాలో తొలి ఓటింగ్‌లోనే స్పీకర్ ఎన్నిక ఖరారు కాకపోవడమనేది 100 ఏళ్లలో ఇదే మొదటిసారి. 1923లో మసాచుసెట్స్‌కు చెందిన రిపబ్లికన్ నేత ఫెడెరిక్ గిల్లెట్ 9 రౌండ్ల తర్వాత స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
చదవండి: ఆ నగరాన్ని వీడితే ఒక్కో పిల్లాడికి 6 లక్షలు...u
430 మంది సభ్యులున్న ప్రతినిధుల సభలో స్పీకర్‌గా ఎన్నికవ్వాలంటే 218 ఓట్లు అవసరరం. సభలో రిపబ్లికన్ పార్టీకి స్వల్ప మెజార్టీ ఉండటంతో కెవిన్ మెకార్థీ సునాయాసంగానే గెలవాల్సి ఉన్నా.. దాదాపు 20 మంది రిపబ్లికన్లు ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థించేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో మూడు రోజుల నుంచి ఓటింగ్ మీద ఓటింగ్ జరుపుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 12 సార్లు ఓటింగ్ జరిగినా మెకార్థీ నెగ్గలేకపోయారు.