Skip to main content

China: కోట్ల ఇళ్లులు ఖాళీ... ఎటు చూసినా ఘోస్ట్‌ సిటీస్‌... ఎక్కడో తెలుసా..?

చైనాను కష్టాలు వెన్నాడుతున్నాయి. కరోనా విలయతాండవంతో ఆ దేశం అల్లాడుతోంది. దీనికి తోడు రియల్‌ ఎస్టేట్‌ రంగం పూర్తిగా దివాళ అంచున నిల్చుంది. దీంతో పూర్తయిన ఇళ్లను కొనేవారేలేక ఖాళీగా పడి ఉంటున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ దివాళ అంచున నిలబడడం... మరోవైపు కరోనా కల్లోలం చైనాను ముప్పుతిప్పలు పెడుతున్నాయి.
China

చైనాలో కోటికి పైగా జనాభా ఉండే నగరాలు పదికి పైనే ఉన్నాయి.  1970ల తర్వాత చైనాలో పట్టణీకరణ రాకెట్‌ వేగంతో దూసుకుపోయింది. పట్టణాలు,నగరాలు భారీగా పెరిగిపోయాయి. పెద్ద మొత్తంలో గ్రామీణ ప్రజలు ఉపాధి అవకాశాలు అంది పుచ్చుకుంటూ నగరాలకు వలసలు రావడం మొదలు పెట్టారు. 

చ‌దవండి: ఒకే ఒక ఓటు... అబాసుపాలైన ట్రంప్‌
50ఏళ్ల వ్యవధిలో ఈ వలసలు ఎంత వేగంగా పెరిగాయంటే ప్రస్తుతం చైనాలో  పట్టణ జనాభా 64 శాతానికి పెరిగింది. గ్రామీణ చైనాలో కేవలం 36 శాతం మంది ప్రజలు మాత్రమే జీవిస్తున్నారు. అందరూ పట్టణాలవైపు మొగ్గు చూపడంతో అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఊపందుకుంది. భూముల క్రయ విక్రయాలు.. రియల్‌ ఎస్టేట్‌ కారణంగా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చి చేరేది.

చ‌దవండి: ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?
అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు ఎవర్‌ గ్రాండే, ఫాంటాసియాలు దివాళా తీశాయి. దీంతోపాటు రియల్‌ ఎస్టేట్‌ తీవ్ర సంక్షభంలో కూరుకుపోవడంతో కంపెనీలు, బిల్డర్లు కట్టిన ఇళ్లను కొనేవారే లేకుండా పోయారు. మరోవైపు నిర్మాణాలు సగంలోనే ఆపేశారు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా దెయ్యాల నగరాలే కనిపిస్తున్నాయి. అంటే నిజంగా దయ్యాలు ఉంటాయని కాదు కానీ.. ఆ నగరాల్లో ఎవరూ ఉండరని అర్థం. చైనాలోని ఈ దెయ్యాల నగరాలే ఇపుడు ప్రభుత్వానికి పెద్ద సవాల్‌ విసురుతున్నాయి.

చ‌ద‌వండి: ఆ న‌గ‌రాన్ని వీడితే ఒక్కో పిల్లాడికి 6 ల‌క్ష‌లు...
చైనాలో ఖాళీగా ఉన్న ఇళ్లను పంచిపెడితే 9 కోట్ల మందికి ఇళ్లు అందించవచ్చు. జర్మనీ, ఫ్రాన్స్‌, కెనడా వంటి దేశాల్లోని మొత్తం జనాభాకు సరిపడ ఇళ్లు చైనాలో ఖాళీగా ఉన్నాయంటే  పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2021 లో చైనాలో ఇళ్ల నిర్మాణాల్లో 14 శాతం తగ్గుదల నమోదయ్యింది. వరుస సంక్షోభాలతో ఎవ్వరి దగ్గరా డబ్బులు లేవు. అందుకే కోట్లాది ఇళ్లు  ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి.  వేలాది బిలియన్ల డాలర్లమేరకు పెట్టుబడి పెట్టిన వెంచర్లు మధ్యలోనే ఆగిపోవడం..రియల్‌ వ్యాపారులనే కాదు చైనా ప్రభుత్వాన్నీ కంగారు పెడుతోంది. యావత్‌ ప్రపంచాన్ని శాసించేయాలని సామ్రాజ్య వాద విస్తరణ కాంక్షతో  రగిలిపోతోన్న చైనాలో అసలు పరిస్థితి చాలా భయంకరంగా ఉందని ఆర్ధిక రంగ నిపుణులు అంటున్నారు.

Published date : 07 Jan 2023 03:37PM

Photo Stories