Skip to main content

Japan Tokyo: ఆ న‌గ‌రాన్ని వీడితే ఒక్కో పిల్లాడికి 6 ల‌క్ష‌లు... ఏంటా న‌గ‌రం.. ఎందుకు ఇస్తున్నారో తెలుసా...?

దేశమంటే మట్టికాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌ అని ఏనాడో గురజాడ అప్పారావు చెప్పారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నాణ్యమైన మానవ వనరులే దేశాభివృద్ధికి దోహదపడుతున్నాయి. అలాగే జనాభా అంతా నగరాలకే పరిమితం అవడం కూడా పెద్ద సమస్యగా మారుతోంది.
Tokyo

నగరాల్లో విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండడంతో ప్రజలు పల్లెలు ఖాళీ చేసి పట్టణాల వైపు పరుగులు తీస్తున్నారు. ఇలాంటి పరిణామాలతోనే జపాన్‌ రాజధాని టోక్యో తీవ్రంగా ప్రభావితమవుతోంది. దీంతో ప్రజలు టోక్యో నగరాన్ని వీడితే భారీగా తాయిళాలు కూడా అందజేస్తోంది. 

చ‌ద‌వండి: పదో తరగతికే పెళ్లి... మూడేళ్లకే భర్త మృతి... కట్‌ చేస్తే ఇప్పుడామె‘ఆదర్శం’
టోక్యో నగరం విడిచి వెళితే కుటుంబంలోని పిల్లలకి ఒక్కొక్కరికి 10 లక్షల యెన్‌ అంటే భారత్‌ కరెన్సీలో రూ. 6 లక్షలు ఇస్తామని జపాన్‌ ప్రభుత్వం తమ పౌరులకు ఆశ చూపిస్తోంది. జపాన్‌ లో జనాభా దేశవ్యాప్తంగా సమానంగా విస్తరించకపోవడమే ఇందుకు కారణం. అక్కడ నగరాలు, పట్టణాలు జనంతో కిక్కిరిసిపోతూ ఉంటే గ్రామీణ ప్రాంతాలు, చిన్న  పల్లెలు ఖాళీ అయిపోతున్నాయి.

చ‌ద‌వండి: పేపర్‌ బాయ్‌ నుంచి ఐఏఎస్‌ వరకు...
టోక్యో, ఒసాకా వంటి నగరాల్లో జనాభా అంతకంతకూ పెరిగిపోతోంది.అందుకే కుటుంబంలో ఒక్కో పిల్లకి 10 లక్షల యెన్‌ లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జపాన్‌ కు ఇదేమీ కొత్త కాదు. మూడేళ్ల కిందట కూడా టోక్యోకి టాటా చెప్పండంటూ 3 లక్షల యెన్‌ లు ప్రకటించించింది. జనాలెవరూ రాజధాని వీడి వెళ్లడానికి ఇష్టపడ లేదు. దీంతో ఈ సారి ఇన్సెంటివ్‌ను భారీగా పెంచి 10 లక్షల యెన్‌ లు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో వెళ్లేవారికి ఈ ఇన్సెంటివ్‌ లభిస్తుంది.  

చ‌ద‌వండి: నోట్ల రద్దు నిర్ణయం సరైనదే: సుప్రీం... అప్పట్లో 115 మంది మృతి...
జపాన్‌ లో నానాటికి జనాభా తగ్గిపోతోంది. 1973 నుంచి ఆ దేశంలో జననాల రేటు తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం జపాన్‌ జనాభా 12.50 కోట్లు కాగా టోక్యో జనాభా 1.5 కోట్లు. దేశంలో మొత్తం జనాభాలో ఇంచుమించు 10శాతం మంది రాజధానిలోనే నివసిస్తున్నారు. ఈ నగరంలో జన సాంద్రత 6,158గా ఉంది. జపాన్‌ లో జనాభా తగ్గుతూ వస్తూ ఉంటే టోక్యోలో జనాభా గత దశాబ్దంలో 16 శాతం పెరిగింది.

చ‌ద‌వండి: మళ్లీ తెరపైకి యోయో... యోయోలో టాప్‌ స్కోరర్‌ ఎవరో తెలుసా..?
యువతీ యువకులు ఉపాధి అవకాశాల కోసం రాజధాని బాట పడుతున్నారు. దీంతో ఇసుక వేస్తే రాలనంత జనాభాతో టోక్యో ఊపిరి పీల్చుకోలేకపోతోంది. 2020 నాటికి జపాన్‌ లో జనాభాలో 52 శాతం మంది మూడు అతి పెద్ద మెట్రోపాలిటన్‌  ప్రాంతాలైన టోక్యో, ఒసాకో, నగోయాలో నివసిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో 48 శాతం మంది ఉన్నారు. 2050 నాటికి ఈ మూడు నగరాల్లోనే 57 శాతం మంది నివసిస్తారని, మిగిలిన ప్రాంతాల్లో 43 శాతం మంది ఉంటారని అంచనాలున్నాయి. దేశ రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కార్యకలాపాలన్నింటికీ టోక్యో కేంద్ర బిందువుగా ఉంది. దీంతో ఈ ప్రాంతంలో భూకంపం వచ్చే ముప్పు పెరిగిపోయిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే జనాభా అన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది.

చ‌ద‌వండి: రెండేళ్లు టెంట్లలో పడుకుని ఏడు కోట్లు సాధించాడు... అతని వయసు కేవలం పదేళ్లే
పల్లెల్లో కాలుష్యం లేని జీవనంపై ప్రత్యేకంగా వీడియోలు విడుదల చేస్తూ జనాన్ని ఆకర్షించే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోంది. ప్రతీ ఒక్కరూ రాజధానిలో మకాం ఉంటే జరిగే అనర్థాల గురించి ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది. పిల్లల సంరక్షణ, విద్య, ఆరోగ్యంతో పాటు నగరాల్లో ఉంటే సదుపాయాలన్నీ పల్లెల్లో కల్పిస్తోంది. ఏ ప్రాంతంలోనైనా  జనం ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. కరోనా తర్వాత ఉద్యోగాలన్నీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఎక్కువ కావడంతో టోక్యోలో ఉండాల్సిన పని లేదని, ఇతర చోట్లకు వెళ్లాలని చెప్తోంది. దీంతో 2019లో 71 కుటుంబాలు టోక్యోని వీడి వెళితే, 2021లో 1,184 కుటుంబాలు ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. 2027 నాటికి ఏడాది 10 వేల కుటుంబాలు మకాం మారుస్తాయని అంచనాలు వేస్తోంది.

 

Published date : 06 Jan 2023 01:49PM

Photo Stories