Asian Champions Trophy: ఐదోసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలుచుకున్న భారత్
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. చైనాలో జరిగిన ఈ ఈవెంట్‌లో పరాజయం ఎరుగని టీమిండియా జైత్రయాత్ర టైటిల్ నిలబెట్టుకునేదాకా అజేయంగా సాగింది. సెప్టెంబర్ 17వ తేదీ జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా 1–0తో చైనా జట్టుపై గెలిచి టోర్నీ చరిత్రలో ఐదోసారి చాంపియన్‌షిప్‌ను సాధించింది.
ఇప్పటి వరకు 8 ఏసీటీ ఈవెంట్లు జరిగితే ఇందులో అత్యధికంగా ఐదుసార్లు భారత్ 2011, 2016, 2018 (పాక్‌తో కలిసి సంయుక్త విజేత), 2023లలో విజేతగా నిలిచింది. డిఫెండర్ జుగ్‌రాజ్ సింగ్ ఆఖరి క్వార్టర్‌లోని 51వ నిమిషంలో చేసిన ఫీల్డ్ గోల్‌తో భారత్ విజయం సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో గానీ, ఆటతీరులో గానీ సాటిరాని చైనా జట్టు ఫైనల్లో హర్మన్‌ప్రీత్ సేనకు ఊహించని విధంగా పోటీ ఇచ్చింది.
Neeraj Chopra: డైమండ్ లీగ్ ఫైనల్‌లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం