Skip to main content

Neeraj Chopra: డైమండ్ లీగ్ ఫైనల్‌లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం

ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ మీట్ గ్రాండ్ ఫైనల్ ఈవెంట్లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.
Neeraj Chopra finishes second in Diamond League Final behind Anderson Peters

సెప్టెంబ‌ర్ 14వ తేదీ అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో నీరజ్ జావెలిన్‌ను 87.86 మీటర్ల దూరం విసిరి రెండో స్థానాన్ని సంపాదించాడు. నీరజు 12 వేల డాలర్లు (రూ.10 లక్షలు) ప్రైజ్ మనీగా లభించాయి. 
ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన నీరజ్ డైమండ్ లీగ్ గ్రాండ్ ఫైనల్ ఈవెంట్లో టాప్-3 లో నిలువడం ఇది మూడోసారి. 

2022 గ్రాండ్ ఫైనల్లో విజేతగా నిలిచిన నీరజ్.. 2023 గ్రాండ్ ఫైనల్లో రెండో స్థానాన్ని పొందాడు. ఈసారి డైమండ్ లీగ్ ఫైనల్లో గ్రెనెడాకు చెందిన రెండుసార్లు ప్రపంచ మాజీ చాంపియన్ అండర్సన్ పీటర్స్ విజేతగా నిలిచాడు. 

పీటర్స్ జావెలిన్ను 87.87 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. జూలియన్ వెబెర్ (జర్మనీ, 85.97 మీటర్లు) మూడో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్ మొత్తం నీరజ్ నిలకడగా రాణించాడు. ఆరు టోర్నీల్లో పోటీపడి ఐదింటిలో రెండో స్థానాన్ని, ఒక టోర్నీలో అగ్ర స్థానాన్ని పొందాడు. 

Oscar Piastri: అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రి టైటిల్‌ విజేత ఆస్కార్‌ పియాస్ట్రి

Published date : 17 Sep 2024 10:01AM

Photo Stories