Skip to main content

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

రాజకీయాల్లో సర్పంచిగా, వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన వారు కోట్లకు కోట్లు సంపాదించుకుంటున్నారు. అలాంటిది దేశానికి ప్రధాన మంత్రి అయిన వ్యక్తి ఆస్తి ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసుకునే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది.
PM NarendraModi

మరి మన దేశ ప్రధాని నరేంద్రమోదీ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసుకుందాం. 

చ‌ద‌వండి: ఏపీలో మహిళా ఓటర్లే ఎక్కువ... మొత్తం ఓటర్లు 4 కోట్లు... పూర్తి వివరాలు
ప్రధాని నరేంద్ర మోదీ తన ఆస్తులను 2022లో ప్రకటించారు. 2021తో పోలిస్తే ఆయన ఆస్తి కాస్త పెరిగింది. ఇదే సమయంలో తన వద్ద ఉన్న భూమిని విరాళంగా ఇచ్చేశారు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ రూ.2.23,82,504 ఉంది. ఏటా ఆస్తులు, అప్పులు వివరాలను వెల్లడిస్తున్న మోదీ.. గతేడాది మార్చి 31 నాటికి తన ఆస్తుల వివరాలను బహిర్గతం చేశారు. పీఎంవో వెల్లడించిన వివరాల ప్రకారం.. గతేడాదితో పోలిస్తే ప్రధాని ఆస్తులు రూ.26లక్షల మేర పెరిగాయి. మొత్తం ఆయన ఆస్తుల విలువ రూ.2.23 కోట్లుగా ఉండగా.. వీటిలో అధికంగా బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే ఉన్నాయి. 

చ‌ద‌వండి:​​​​​​​ ఆ న‌గ‌రాన్ని వీడితే ఒక్కో పిల్లాడికి 6 ల‌క్ష‌లు...
మోదీకి ఎలాంటి స్థిరాస్థులూ లేవని పీఎంవో స్పష్టంచేసింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న కొంత నివాసయోగ్యమైన భూమిలో తన వాటాను(దీని విలువ రూ.1.1 కోట్లు దానంగా ఇచ్చినందున ఆయనకు స్థిరాస్తులేమీ లేవని తెలిపింది. బాండ్లు, షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ రూపంలో మోదీకి పెట్టుబడులు లేవని, ఆయనకు సొంత వాహనం కూడా లేదని వెల్లడించింది. కానీ ఆయనకు నాలుగు బంగారం ఉంగరాలు ఉండగా.. వాటి విలువ రూ.1.73లక్షలు.

చ‌ద‌వండి: పేపర్‌ బాయ్‌ నుంచి ఐఏఎస్‌ వరకు...
2002 అక్టోబర్‌లో మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్న సమయంలో మరో ముగ్గురు వాటాదార్లతో కలిసి కొనుగోలు చేసిన నివాసయోగ్య భూమి (సర్వే నంబర్‌ 401/ఎ)లో ఒక్కొక్కరికి 25శాతం సమాన వాటా ఉందని.. దాన్నే మోదీ విరాళంగా ఇచ్చారు. మోదీ చేతిలో రూ.35,250నగదు, పోస్ట్‌ ఆఫీస్‌లో రూ.9,05,105 విలువ చేసే నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్లతో పాటు రూ.1,89,305 విలువ చేసే జీవిత బీమా పాలసీ ఉన్నాయి.

Published date : 06 Jan 2023 07:05PM

Photo Stories