సాక్షి ఎడ్యుకేషన్: పాలిటెక్నిక్ పూర్తిచేసి, ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలు పొందే విద్యార్థులకు నిర్వహించిన ఈసెట్ పరీక్ష ఫలితాలను కూడా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగస్టు 12వ తేదీన (శుక్రవారం) విడుదల చేశారు.
Sabitha Indra Reddy, TS Education Minister
ఈ పరీక్షకు 24,055 మంది దరఖాస్తు చేస్తే, 22,001 మంది పరీక్ష రాశారు. వీరిలో 19,954 మంది (90.69 శాతం) అర్హత పొందారు. కుర్చా హేమంత్ (విశాఖ), జి సాయినాగరాజు (పశ్చిమగోదావరి), కె నర్సింహనాయుడు (విశాఖ), ఇండిగ ఆకాశ్ (విశాఖ), ఐతంశెట్టి జగన్ (అనకాపల్లి) మొదటి ఐదు ర్యాంకులు పొందారు.