TS ECET Results 2023 Link : టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల.. ఈ సారి ఎంత మంది పాస్ అయ్యారంటే..?
ఈ ఏడాది టీఎస్ ఈసెట్‌లో 93.07శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో 22335 మంది, బీఎస్సీ (గణితం)లో 16 మంది, ఫార్మసీలో 103 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మే 20న జరిగిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 22వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.
తెలంగాణలోని ఇంజినీరింగ్ కాలేజీ కోర్సుల్లో ప్రవేశాలకు టీఎస్ ఈసెట్ నిర్వహిస్తారు. పాలిటెక్నిక్, బీఎస్సీ (గణితం) పూర్తిచేసిన విద్యార్థులకు ఈసెట్ ర్యాంకుల ఆధారంగా బీఈ/ బీటెక్/ బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ టీఎస్ ఈసెట్-2023 ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో చూసుకోవచ్చు.
హైదరాబాద్‌లో 40 పరీక్ష కేంద్రాలతో పాటు తెలంగాణ జిల్లాలో 44, ఏపీలో 7 కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు టీఎస్ ఈసెట్ 2023ని ఆన్‌లైన్‌లో నిర్వహించిన విషయం తెల్సిందే.