AP EAPCET 2022: నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఇదే..
Sakshi Education
ఏపీఈఏపీసెట్–2022 (ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) నోటిఫికేషన్ ను విడుదలైంది.
ఏపీఈఏపీసెట్ చైర్మన్ ప్రొఫెసర్ జింకా రంగజనార్దన, కన్వీనర్ ప్రొఫెసర్ ఎం.విజయకుమార్‌లు ఏప్రిల్ 11న జేఎన్ టీయూ(అనంతపురం)లో నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
చదవండి:
ఎంసెట్ స్టడీమెటీరియర్, సిలబస్, మోడల్‌పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి
ఎంసెట్: మోడల్ పేపర్లు | ప్రివియస్ పేపర్స్ | ప్రాక్టీస్ ప్రశ్నలు
షెడ్యూల్ ఇలా:
- ఈ నెల 11 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు అందుబాటులోకొస్తాయి.
- దరఖాస్తుకు చివరి తేదీ మే 10
- జూన్ 20 వరకు రూ.500 అపరాధ రుసుముతో..
- జూన్ 25 వరకు రూ.1000 అపరాధ రుసుముతో..
- జూలై 1 వరకు రూ.5,000 అపరాధ రుసుముతో..
- జూలై 3 వరకు రూ.10 వేల అపరాధ రుసుముతో..
- జూన్ 23 నుంచి 26వ తేదీ వరకు డేటా మార్పు, చేర్పులకు అవకాశం.
- జూన్ 27 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Published date : 12 Apr 2022 12:40PM