Skip to main content

NIMS Hyderabad BPT Admission 2024: 'నిమ్స్‌'లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

NIMS Hyderabad BPT Admission 2024  Bachelor of Physiotherapy admission announcement NIMS 2024-25  NIMS Hyderabad BPT course admission notice NIMS Hyderabad invites BPT applications 2024-25  NIMS BPT course application form 2024-25  Apply for BPT at NIMS Hyderabad 2024-25

హైదరాబాద్‌లోని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌).. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ(బీపీటీ)కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

కోర్సు: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ. 
కోర్సు వ్యవధి: నాలుగున్నర సంవత్సరాలు(6 నెలల ఇంటర్న్‌షిప్‌ కలుపుకొని)

అర్హత: బోటనీ, జువాలజీ, ఫిజిక్స్‌ అండ్‌ కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ /తత్సమాన లేదా బయలాజికల్‌ అండ్‌ ఫిజికల్‌ సైన్సెస్‌ బ్రిడ్జి కోర్సుతో ఒకేషనల్‌ ఫిజియోథెరపీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు తెలంగాణ ఎంసెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
వయసు: 31/12/24 నాటికి 17ఏళ్ల నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.

ISRO : ఆగస్టు 15న చేప‌ట్ట‌నున్న ‘ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌’ ప్ర‌యోగం..

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది అసోసియేట్‌ డీన్, అకడమిక్‌–2, సెకండ్‌ ఫ్లోర్, ఓల్డ్‌ ఓపీడీ బ్లాక్, నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, హైదరాబాద్‌–500082 చిరునామకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 23, 2024
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: ఆగస్టు 27, 2024

వెబ్‌సైట్‌: https://nims.edu.in/

Published date : 14 Aug 2024 09:19AM
PDF

Photo Stories