TS EAPCET 2024 Counselling: సివిల్, మెకానికల్, ఈఈఈ కోర్సుల్లో తగ్గుతున్న సీట్లు... కంప్యూటర్ కోర్సుల్లో 76 శాతానికి పెరిగిన సీట్లు
హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో సివిల్, మెకాని కల్, ఎలక్ట్రికల్ బ్రాంచీలకు ఆదరణ కరువవుతోంది. గత నాలుగేళ్లలో ఈ గ్రూపుల్లో 10 వేల సీట్లు తగ్గిపోగా, ఈ ఏడాది (2024–25) మరో 6 వేల సీట్లు కనుమరుగయ్యాయి. డిమాండ్ లేని బ్రాంచీల్లో సీట్లు తగ్గించి, ఆదరణ ఉన్న బ్రాంచీల్లో పెంచుకునేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతించడంతో అన్ని కాలేజీలూ ఇదే బాట పడుతున్నాయి. కోర్ గ్రూపుల్లో సీట్లు తగ్గించుకుని కంప్యూటర్ కోర్సు ల్లో పెంచుకుంటున్నాయి. కేవలం నాలుగేళ్లలోనే కంప్యూటర్ కోర్సుల్లో 11 వేల సీట్లు పెరిగాయి.
ఈ పరిస్థితి జిల్లాల్లోని ఇంజనీరింగ్ కాలే జీల మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. కంప్యూటర్ కోర్సుల నిర్వహణ ఆ కాలేజీలకు కష్టమ వుతోంది. మౌలిక వసతుల కల్ప న, నాణ్యమైన ఫ్యాకల్టీ సమకూర్చుకోవడం కత్తిమీద సాములా మారింది. దీంతో పలు జిల్లాల్లో 2014–24 మధ్య 90కిపైగా కాలేజీలు మూతపడ్డాయి. ఒక్క వరంగల్ జిల్లాలోనే నాలుగేళ్లలో 8 కాలేజీలు కనుమ రుగయ్యాయి. ఆదిలాబా ద్‌లో మూడు కాలేజీలుంటే ఇప్పుడు ఒక్కటీ లేదు.
నిజామాబాద్‌లో గతంలో ఆరు ఉంటే ఇప్పుడు నాలుగున్నాయి. ఎక్కువ మంది విద్యార్థులు ఇంజనీ రింగ్ విద్య కోసం రాజధానినే ఎంచుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 ఇంజనీరింగ్ కాలేజీలుంటే, 109 కాలేజీలు మేడ్చల్–మల్కా జిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మేడ్చల్‌లో 45, రంగారెడ్డిలో 44, హైదరాబాద్‌లో 20 కాలేజీలున్నాయి.
మార్చేస్తున్న పోటీ
ఇంజనీరింగ్ తర్వాత కన్పించేవన్నీ సాఫ్ట్‌వేర్ ఉద్యో గాలే. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కోర్సులు చేసినా ఉపాధి కోసం వెతుక్కోవాల్సింది ఐటీ సెక్టార్‌లోనే. దీనివల్లే విద్యార్థులు కంప్యూటర్ కోర్సుల్లో చేరేందుకే ఇష్టపడుతున్నారు. రాష్ట్రంలో ఏటా లక్ష మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు తయారవుతుండగా, 70 శాతం కంప్యూటర్ సైన్స్ నేపథ్యంతోనే వస్తున్నారు. వీరిలో కేవలం 10 శాతం మందికి కూడా స్కిల్స్ ఉద్యోగాలు దొరకట్లేదు.
గ్రామీణ ప్రాంతాల్లో సీఎస్‌ఈ చేసినా బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండటం లేదని పారిశ్రామిక వేత్తలు అంటున్నారు. ఇంజనీరింగ్‌తోపాటు ఏదో ఒక కొత్త కోర్సు నేర్చుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుతూనే పార్ట్‌టైం ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ అవకాశాలన్నీ హైదరాబాద్‌లో ఉంటేనే సాధ్యమని విద్యార్థులు భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు లేకపోవడంతో ఇంటర్న్‌షిప్, ప్రాజెక్టు వర్క్ లాంటివీ సాధ్యం కావట్లేదు.
Also Read: TS DSC 2024 Results : టీఎస్ డీఎస్సీ -2024 ఫలితాలు విడుదల తేదీ ఇదే..! సెప్టెంబరు 5వ తేదీలోపు..
ఆ కోర్సుల జాడెక్కడ?
గత ఐదేళ్లల్లో సివిల్, మెకానికల్, ఈఈఈ వంటి కోర్ గ్రూపుల్లో ప్రవేశాలు భారీగా తగ్గాయి. ఈ బ్రాంచీల్లో సీట్లను కాలేజీలు తగ్గిస్తున్నాయి. 2020 సంవత్సరంలో ఈ గ్రూపుల్లో కన్వీనర్ కోటా కింద 40,355 సీట్లుంటే, 2024 నాటికి ఇవి 30,900కు పడిపోయాయి. ఉన్న సీట్లలోనూ ప్రవేశాలు 50 శాతం మించడం లేదు.
కానీ సీఎస్‌ఈ, ఐటీ సహా కంప్యూటర్ బ్రాంచీల్లో చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు. కాలేజీలు కూడా ఈ గ్రూపుల్లో సీట్లు పెంచుకునేందుకు బారులు తీరుతున్నాయి. 2020లో కంప్యూటర్ బ్రాంచీల్లో 58,633 సీట్లుంటే, 2024 నాటికి 67,248 సీట్లయ్యాయి. 65.13 శాతం నుంచి 76.46 శాతం సీట్లు ఈ గ్రూపుల్లో పెరిగాయి. ఇతర కోర్ గ్రూపుల్లో మాత్రం 2020–24 మధ్య 37.87 శాతం ఉన్న సీట్లు 23.54 శాతానికి పడిపోయాయి.
Tags
- Engineering Admission
- Core Group admission
- TS EAPCET 2024
- Engineering Admissions
- EAMCET Counselling
- telangana engineering admissions 2024
- Sakshi Education News
- TSCHE
- EngineeringTrends
- CivilEngineeringSeats
- MechanicalEngineeringSeats
- ElectricalEngineeringSeats
- AICTERegulations
- ComputerCoursesIncrease
- EngineeringSeatReduction
- CoreBranches
- EngineeringEducation
- SeatAllocation2024