Skip to main content

AP EAPCET Counselling 2024 Start: నేటి నుంచి ఏపీ ఇంజినీరింగ్ ప్రవేశాల 2024 కౌన్సెలింగ్ ప్రారంభం.. ముఖ్య‌మైన తేదీలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన‌ AP EAPCET 2024 ప్ర‌వేశాల‌ ప్రక్రియ జులై 1వ తేదీ నుంచి ప్రారంభంకానుంది.
AP EAPCET Counselling 2024 Full Details

దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను.. సాంకేతిక విద్యాశాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ బి.నవ్య తెలిపారు. 

AP EAPCET 2024 ప్ర‌వేశాల‌ ప్రక్రియ ఆన్‌లైన‌ విధానంలో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లిపు ప్రక్రియ జులై 1వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని ప్రకటించారు. అలాగే జులై 7వ తేదీ లోపు పూర్తి చేయవలసి ఉంటుందని తెలిపారు. విద్యార్థులు వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ https://cets.apsche.ap.gov.in/ చూడొచ్చు.

☛☛➤ AP EAPCET College Predictor 2024 కోసం క్లిక్ చేయండి

☛☛➤ TS EAPCET College Predictor 2024 : 1st Phase | 2nd Phase | Final Phase

ఈ సారి ఇంజినీరింగ్ భారీగా..
ఏపీ ఈఏపీసెట్-2024కు రాష్ట్ర వ్యాప్తంగా 3,62,851 మంది ద‌రఖాస్తు చేసుకున్నార‌రు.  3,39,139 మంది ప‌రీక్షల‌కు హాజ‌ర‌య్యారు. ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ కల్పించి వీటి ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు. అలాగే ఈ ఏడాది ఇంజినీరింగ్ విభాగంలో భారీగా 2,74,213 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,58,374 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,95092 మంది అర్హ‌త  సాధించారు. ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగంలో 88,638 మంది దరఖాస్తు చేసుకోగా.. 80,766 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 70,352 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

☛☛➤ AP EAPCET-2024 College Predictor 2024 : AP EAPCET-2024లో మీకు వ‌చ్చిన ర్యాంక్‌కు ఏ కాలేజీలో.. ఏ బ్రాంచ్‌లో.. సీటు వ‌స్తుందంటే..?

AP EAPCET 2024 కౌన్సెలింగ్ ముఖ్య‌మైన తేదీలు ఇవే..
☛➤ జులై 1వ తేదీ నుంచి జూలై 7వ తేదీ 2024 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
☛➤ జులై 4వ తేదీ నుంచి 1వ తేదీ వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది.
☛➤ జులై 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్‌ల ఎంపిక.
☛➤ జులై 13వ తేదీ ఆప్షన్‌ల మార్పునకు అవకాశం
☛➤ జులై 16వ తేదీన సీట్ల కేటాయింపు
☛➤ జులై 17వ తేదీ నుంచి 22 వ తేదీ వ‌ర‌కు సెల్స్ జాయినింగ్, కాలేజీల్లో రిపోర్టింగ్
☛➤ జులై 19వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి.

Published date : 01 Jul 2024 04:03PM

Photo Stories