TS Teachers Promotions and Transfers : ఈ నిబంధనలకు లోబడే టీచర్లకు ప్రమోషన్లు, బదిలీలు.. ఎందుకంటే..?
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో గురువారం ఎస్‌సీఈఆర్‌టీ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ.. పూర్తి పారదర్శకతతో ఎలాంటి అపోహలకు తావులేకుండా పదోన్నతులు, బదిలీల ప్రక్రియను నిర్వహించాలన్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని అధికారులకు సూచించారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విద్యాశాఖ తరఫున వ్యక్తిగతంగా మెసేజ్‌లు పంపాలన్నారు. ఆన్‌లైన్ ప్రక్రియలో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఈ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలన్నారు. జిల్లాల్లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు వీలుగా రాష్ట్రస్థాయి అధికారాలను ఆయా జిల్లాల్లో పర్యవేక్షకులుగా నియమించాలన్నారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు సాఫీగా జరిగేలా చూడాలని మంత్రి సబితా ఆదేశించారు.
చదవండి: TS DSC Notification 2023: జిల్లాల వారీగా టీచర్ పోస్టులు ఇవీ.. అత్యధిక ఖాళీలు ఈ జిల్లాలోనే
Tags
- ts education minister sabitha indra reddy
- ts teachers promotion news 2023
- ts teachers transfers news 2023 telugu
- ts teachers promotion and transfers news 2023 telugu
- ts teachers promotion and transfers rules 2023
- ts teachers promotion and transfers rules 2023 in telugu
- teachers promotion guidelines
- ts teachers promotion guidelines 2023
- ts teachers promotions transfers sabitha indra reddy telugu news
- Sakshi Education Latest News