Skip to main content

DSC 2023 Notification: నిరాశలో నిరుద్యోగులు

కథలాపూర్‌(వేములవాడ):జిల్లాలో డీఎడ్‌, బీఎడ్‌ కోర్సులు పూర్తిచేసిన నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది.
unemployed persons not satisfied
నిరాశలో నిరుద్యోగులు

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏళ్లుగా నిరీక్షిస్తుండగా.. ప్రభుత్వం ఇటీవల గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కానీ, డీఎస్సీ పోస్టుల సంఖ్య తక్కువగా ఉండటం, కేవలం 148 టీచర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై సర్వత్రా ఆందోళనకు గురవుతున్నారు.

చదవండి: TS DSC Notification 2023: జిల్లాల వారీగా టీచర్‌ పోస్టులు ఇవీ.. అత్యధిక ఖాళీలు ఈ జిల్లాలోనే

701 ఖాళీలు.. డీఎస్సీలో 148 పోస్టులు..

  • జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, 20 మండలాలుండగా.. 380 గ్రామాలున్నాయి.
  • ఇందులో 511 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 85 ప్రాథమికోన్నత పాఠశాలలు, 187 జెడ్పీ హైస్కూళ్లు ఉన్నాయి.
  • వీటిలో 3,280 మంది ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారు.
  • పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉంటే ఇప్పటికే సర్దుబాటు చేశారు.
  • అయితే, ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల ఖాళీలు సుమారు 701 ఉన్నట్లు గతంలో నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు.
  • ఖాళీ పోస్టుల్లో 70 శాతం పదోన్నతుల ద్వారా భర్తీచేసి మిగతా పోస్టులు నేరుగా భర్తీ చేస్తారు.
  • ఇందుకోసం డీఎస్సీలో 148 పోస్టులకే ఆర్థికశాఖ అనుమతి ఇచ్చినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

ఆరేళ్ల తర్వాత భర్తీ..

2017 సంవత్సరంలో ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీఆర్‌టీ నిర్వహించి నియామకాలు చేపట్టింది. ఆ తర్వాత నుంచి నియామకాల జాడేలేదు. ఎప్పటికై నా టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తుందన్న నమ్మకంతో ఏటా డిగ్రీ పూర్తయినవారు బీఎడ్‌, డీఎడ్‌ కోర్సుల్లో చేరుతున్నారు. ఆ కోర్సులు పూర్తిచేశాక టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(టెట్‌) అర్హత కోసం పరీక్ష రాస్తున్నారు. అయితే, ప్రస్తుతం జిల్లాలో 148 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కే నోటిఫికేషన్‌ జారీచేస్తామనడంతో బీఎడ్‌, డీఎడ్‌ పూర్తిచేసిన వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
అనుమతి ఇచ్చిన పోస్టులు ఇవే..

స్కూల్‌ అసిస్టెంట్‌: 50
ఎస్జీటీ: 53
లాంగ్వేజ్‌ పండిట్‌: 37
పీఈటీ: 08

Published date : 31 Aug 2023 03:27PM

Photo Stories