Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, డిసెంబ‌ర్ 28th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu December 28th 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations

Corona Variants: ఒక‌టి కాదు.. నాలుగు కొత్త క‌రోనా వేరియంట్లు
చైనాలో ప్రస్తుత పరిస్థితులకు ఒమిక్రాన్ సబ్-వేరియంట్ BF.7 కారణమని పలు నివేదికలు వెల్లడించాయి. అయితే చైనాలో క‌రోనా విల‌యతాండ‌వానికి కేవలం ఈ ఒక్క వేరియంట్‌ మాత్రమే కార‌ణం కాదని, నాలుగు కొత్త వేరియంట్లు కార‌ణం అని భార‌త కోవిడ్ ప్యాన‌ల్ చీప్ ఎన్‌కే అరోడా తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో అరోరా మాట్లాడుతూ.. బీఎఫ్‌-7 ద్వారా 15% కేసులే న‌మోద‌య్యాయ‌ని, బీఎన్‌, బీక్యూ వేరియంట్ల నుంచి 50%, ఎస్‌వీవీ వేరియంట్ నుంచి 15% కేసులు వ‌చ్చాయ‌న్నారు. 
ప్రపంచవ్యాప్తంగా ప్రమాద ఘంటికలు మోగించిన చైనాలో కోవిడ్ తాజా వ్యాప్తిపై దేశంలో భయాందోళనలు అవసరం లేదన్నారు. చైనా నుంచి సరైన సమాచారం లేనందున భారత్ ముందు జాగ్రత్త, ముందస్తు సన్నాహాలు చేస్తోందన్నారు. ఏది ఏమైనప్పటికీ, చైనా వ్యాప్తికి వైరస్‌ల కాక్టెయిల్ కారణమని స్పష్టంగా తెలుస్తోందని, స్థానిక ఎపిడెమియాలజీ కారణంగా భిన్నంగా ప్రవర్తిస్తోందని అరోరా వ్యాఖ్యానించారు. కోవిడ్ మొదటి, రెండు, మూడు వేవ్‌లో వ్యాపించిన ఇన్‌ఫెక్షన్లు, వ్యాక్సిన్‌ల ద్వారా పొందిన రోగనిరోధక శక్తి కలయికతో ఏర్పడిన హైబ్రిడ్ ఇమ్యూనిటీ కారణంగా భారత్ లాభపడుతుందని చెప్పారు.

BF.7 : కరోనా కొత్త వేరియంట్‌ ‘బీఎఫ్‌.7’.. ఈ వైరస్‌ సోకితే ఎలా గుర్తించాలంటే..?

Covid Cases: విలయ తాండవం చేస్తున్న క‌రోనా.. ఆ ఒక్క న‌గ‌రంలోనే రోజుకు 10 లక్షల కేసులు నమోదు 
చైనాలో కరోనా నానాటికీ చుక్కలు చూపుతోంది. రోజూ లక్షలాది మంది దాని బారిన పడుతున్నారు. షాంఘై సమీపంలోని పారిశ్రామిక నగరం జిజెయాంగ్‌లో రోజుకు కనీసం 10 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కొద్ది రోజుల్లోనే ఇవి రోజుకు పాతిక లక్షలు దాటొచ్చని చెబుతున్నారు! దేశవ్యాప్తంగా ఆస్పత్రులకు రోగుల వెల్లువ నానాటికీ పెరుగుతోంది. మార్చురీల బయట శవాలు గుట్టలుగా పేరుకుంటున్నాయి. చాలాచోట్ల కనీసం 10 రోజులకు పైగా వెయిటింగ్‌ పీరియడ్‌ నడుస్తోంది. 
ఒకవైపు కేసులు ఇలా కట్టలు తెంచుకుంటుంటే మరోవైపు వాటి కట్టడి ప్రయత్నాలను, నిబంధనలను పూర్తిగా గాలికొదిలేస్తూ చైనా ప్రభుత్వం హఠాత్తుగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సరిహద్దులను పూర్తిగా తెరవాలని నిర్ణయించింది. అంతేగాక విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మూడేళ్లుగా అమలు చేస్తున్న క్వారంటైన్‌ నిబంధనను కూడా పూర్తిగా ఎత్తేయనుంది. ఇవన్నీ జనవరి 8 నుంచి అమల్లోకి వస్తాని ప్రకటించింది. ఇందుకు వీలుగా కరోనాను డెంగీ తదితర జ్వరాలతో సమానమైన బి కేటగిరీకి తగ్గిస్తూ జాతీయ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకుంది. 

New Variant BF7 : ఈ కొత్త వేరియంట్‌తో వీరికే ముప్పు ఎక్కువ‌.. ఎందుకంటే...?

US Winter Storm: అమెరికాలో కొనసాగుతున్న మంచు విలయం
అమెరికాలో మంచు తుఫాను విలయం కొనసాగుతూనే ఉంది. ఈ శతాబ్దంలోనే ఎన్నడూ ఎరగనంతటి చలి గాలులు, తుఫాన్లు, మంచు ధాటికి దేశమంతా అతలాకుతలమైంది. 4,000 పై చిలుకు దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 60 దాటింది. ఒక్క న్యూయార్క్‌ రాష్ట్రంలోనే కనీసం 30 మంది దాకా చనిపోయారు. ఇక్కడి బఫెలో కౌంటీలో పరిస్థితి దారుణంగా ఉంది. ఎటు చూసినా కనీసం 50 అంగుళాల మేర మంచు పరుచుకుపోయింది. 1880ల తర్వాత ఈ ప్రాంతం ఈ స్థాయిలో హిమపాతాన్ని చూడటం ఇదే తొలిసారి! 
పొంచి ఉన్న వరద ముప్పు
ఉష్ణోగ్రతలు పెరిగితే ఇప్పటిదాకా పేరుకుపోయిన అపారమైన మంచు ఒక్కసారిగా కరిగి ఆకస్మిక వరదలకు దారితీసే ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా బఫెలో వంటి ప్రాంతాలకు ఈ ముప్పు చాలా ఎక్కువని పేర్కొంది. దాంతో వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు యంత్రాంగాన్ని ఇప్పట్నుంచే సిద్ధం చేస్తున్నారు.  

Snow Storm: అంధకారంలో అగ్రరాజ్యం.. మంచు తుఫాను విశ్వరూపం

Nasal Vaccine: కోవిడ్ నాసికా టీకా ధ‌ర ఖ‌రారు
ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇంకోవాక్‌ ధరను దాని తయారీదారు భారత్‌ బయోటెక్ డిసెంబ‌ర్ 27న ప్రకటించింది. ప్రభుత్వ కోవిన్‌ పోర్టల్‌ ద్వారా అందుబాటులో ఉండే ఈ  నాసికా వ్యాక్సిన్‌ను రూ.800కు అందివ్వనున్నట్లు తెలిపింది. దీనికి పన్నులు అదనం. కాగా భారీ స్థాయిలో సేకరించి, పౌరులకు అందించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.325కు డోస్‌ చొప్పున (పన్నులు అదనం) విక్రయిస్తామని తెలిపింది. జనవరి నాలుగో వారంలో దీన్ని మార్కెట్లోకి విడుదలచేస్తారు.

James Webb telescope: మన ముంగిట్లో మరో ఏడు ‘భూములు’! 
ఒకటి కాదు, రెండు కాదు. అచ్చం భూమిలాగే ఉన్న ఏడు గ్రహాలను జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ తాజాగా పూర్తిస్థాయిలో వెలుగులోకి తెచ్చింది! ఇవన్నీ మనకు కేవలం 39 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ట్రాపిస్ట్‌–1 అనే నక్షత్ర వ్యవస్థలో ఉన్నాయట. రాళ్లు, పర్వతాలమయంగా ఉన్న ఈ గ్రహాల ఉపరితలంపై అపారమైన జల వనరులకు పుష్కలంగా ఆస్కారముందట. మన మహాసముద్రాలన్నింట్లోనూ ఉన్నదాని కంటే ఎక్కువ జలమున్నట్టు తేలినా ఆశ్చర్యం లేదని సైంటిస్టులు అంటున్నారు. వాటిపై జీవం ఉనికికి అనువైన పరిస్థితులున్నాయా అన్నది తేల్చడంలో వారిప్పుడు తలమునకలయ్యారు. ‘‘ఈ గ్రహాలపై నెలకొన్న వాతావరణ పరిస్థితులు తదితరాలపై జేమ్స్‌ వెబ్‌ ప్రస్తు తం దృష్టి సారించింది. ఈ విషయమై కొత్త సంవత్సరంలో మనకు పెద్ద శుభవార్తే అందవచ్చు’’ అని నాసా చెబుతోంది. ట్రాపిస్ట్‌ పరిమాణంలో సూర్యునిలో పదో వంతుంటుందట.

Best Moments in India 2022 : భారత్‌లో 2022లో జరిగిన చరిత్మ్రాక మెరుపులు ఇవే..

Spacewalk: స్పేస్‌ వాక్‌.. ఐఎస్‌ఎస్‌కు సోలార్‌ ప్యానళ్ల బిగింపు 
వయో భారంతో సతమతమవుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) సామర్థ్యం పెంచేందుకు నాసా ఫ్లైట్‌ ఇంజనీర్లు జోష్‌ కసాడా, ఫ్రాంక్‌ రుబియో నడుం బిగించారు. ఏడు గంటలపాటు శ్రమించి దానికి కొత్త సోలార్‌ ప్యానళ్లు బిగించారు. ఇందుకోసం అంతరిక్షంలో నడిచారు. వీరికిది మూడో స్పేస్‌ వాక్‌. కొత్త ప్యానళ్లు ఐఎస్‌ఎస్‌ విద్యుదుత్పాదన సామర్థ్యాన్ని 30 శాతం దాకా పెంచనున్నాయి. ఐఎస్‌ఎస్‌కు మరమ్మతులు కోసం శాస్త్రవేత్తలు, సిబ్బంది స్పేస్‌ వాక్‌ చేయడం ఇది 257వ సారట! ఆర్నెల్ల మిషన్లో భాగంగా వాళ్లు ఐఎస్‌ఎస్‌లో గడుపుతున్నారు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (సైన్స్ & టెక్నాలజీ) క్విజ్ (03-09 డిసెంబర్ 2022)

BWF Rankings: ఎనిమిదో ర్యాంక్‌కు ప్రణయ్‌ 
ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ ఎనిమిదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. కొంత కాలంగా చక్కటి ఫామ్‌లో ఉన్న ప్రణయ్‌ బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో ఆడటంతో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డుకు కూడా నామినేట్‌ అయ్యాడు. ఇతర భారత షట్లర్లలో లక్ష్యసేన్‌ తన ఏడో స్థానాన్ని నిలబెట్టుకోగా, కిడాంబి శ్రీకాంత్‌ 12వ స్థానానికి దిగజారాడు. గాయం కారణంగా చాలా కాలంగా ఆటకు దూరమైన పీవీ సింధు కూడా ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానానికి పడిపోయింది.

BWF Rankings: తొలిసారి టాప్‌–20లోకి గాయత్రి జోడీ

President Droupadi Murmu: కాలానుగుణంగా రాజ్యాంగంలో మార్పుచేర్పులు అవసరం 
హైదరాబాద్‌లోని కేశవ్‌ మెమోరియల్‌ విద్యా సంస్థల్లో డిసెంబ‌ర్ 27న‌ నిర్వహించిన ‘నైజాం నుంచి హైదరాబాద్‌ విముక్తి’ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ సంద‌ర్భంగా రాజ్యాంగంలో కాలానుగుణంగా మార్పులు, చేర్పులు సహజమని, అవసరం కూడా అని ఆమె అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతలు అద్భుతమైన రాజ్యాంగాన్ని ప్రసా­దిం­చా­రని కొనియాడారు. 75 సంవత్సరాల్లో దేశ జనాభా ఎంతో పెరిగిందని, ­కా­­లా­ను­గుణంగా మార్పులు చోటుచే­సు­కున్నాయని చెప్పారు. ఆ మార్పులకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, అది అవసరం కూడా అని చెప్పారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని, పాశ్చాత్య దేశాల సంస్కృతిని కొంతవరకు అనుసరించినా, మన మూలాలను మరిచి పోవద్దంటూ హితోపదేశం చేశారు. విలువలతో కూడిన విద్య అవసరమని, పుస్తక విజ్ఞానమే కాకుండా, సమాజాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. 

ప్రముఖ సినీనటుడు సీనియర్‌ నటుడు కైకాల కన్నుమూత.. ఈయ‌న జీవిత ప్ర‌స్థానం ఇలా..
లింగ వివక్ష సరికాదు..

‘సమాజంలో లింగ వివక్ష సరికాదు. అందరూ సమానమే అన్న భావన రావాలి. కొందరు దేవాలయంలో అమ్మవారికి వంగివంగి దండాలు పెడ్తారు. మహిళలను కించపరిచే సమయంలో అలాంటి వారికి మన దేవతలు గుర్తుకు రారా? భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో ఉన్నతమైనవి. వాటిని వదిలేసి పాశ్చాత్య సంస్కృతిలో పడొద్దు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నారో పరిశీలించాల్సిన అవసరం ఉంది. మహిళలపై ఆంక్షలు విధించడం సరికాదు. వారు ప్రస్తుతం ఎంతో ఉన్నతస్థాయికి ఎదుగుతున్నారు. ఇంట్లో భోజనం కంటే హోటల్లో భోజనం బాగుందని రోజూ వెళ్లలేం కదా. అలాగే భారత సంస్కృతి సంప్రదాయాలకు విలువ ఇవ్వాలి. ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవాలి. దేశ సంస్కృతిని కించపరిచే చర్యలు సరికాదు. ప్రపంచ వ్యాప్తంగా మన దేశానికి పేరు, ప్రఖ్యాతులు వచ్చాయంటే అది కేవలం మన ఉన్నతమైన సంస్కృతితోనే..’ అని రాష్ట్రపతి స్పష్టం చేశారు.

Good News: ఈ కేంద్ర పథకం ద్వారా మీకు రూ.15 లక్షలు వస్తాయ్‌..! మీరు ఇలా చేస్తే..
తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలు చిరస్మరణీయం 

హైదరాబాద్‌ సంస్థానం నుంచి విముక్తి కోసం ఉద్యమించిన తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలు చిరస్మరణీయం. వారిని ఎల్లవేళలా గౌరవించాలి. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్‌ విముక్తి ఉత్సవాలు నిర్వహించుకోవడం గొప్ప విషయమ‌ని రాష్ట్ర‌ప‌తి అన్నారు.

ఒక్కో మెట్టునూ అధిరోహిస్తూ రాష్ట్రపతి అయ్యా..
‘చిన్నతనంలో నేను ఎన్ని గ్రామాలు తిరిగినా మార్పు తెలియలేదు. పట్టణానికి వచ్చిన వెంటనే మార్పు చూశా. ఆ మా­ర్పును అధిగమించి ఒక్కో మెట్టునూ అధిరో­హించా. ఈ రోజు మీ ముందుకు దేశ రాష్ట్రప­తి హోదాలో రాగలిగా. అమెరికా, బ్రిటన్‌ మాదిరిగా మన దేశం కూడా ఉండాలని విద్యార్థులు కోరుతున్నారు. కానీ అక్కడి జనాభా ఎంత.? మన జనాభా ఎంత.? మన దేశంలో విభిన్న సంస్కృతులు, భాష­లు, మతాలున్నాయి. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్లవెంటే మనం వెళ్లడం కాదు, వారు మనవెంట వచ్చే విధంగా విద్యార్థులు సిద్ధం కావాలి. (ఈ సమయంలోనే ‘మీరే ప్రధాని అయితే ఏం చేస్తారు?’ అంటూ విద్యార్థులను రాష్ట్రపతి ప్రశ్నించారు. దీనితో ఓ విద్యార్థి స్పందిస్తూ..‘సారే జహాసే అచ్ఛా.. హిందుస్థాన్‌ హమారా..’ అనే నినాదంతో ముందుకెళ్తానని అన్నారు) ‘కథక్, కూచిపూడి, కథాకళి వంటి ఎన్నో నృత్యరీతులను విదేశీ­యు­లు వచ్చి నేర్చుకుంటున్నారు. అది మనకు గర్వకారణమ‌న్నారు. రాష్ట్రపతి అక్కడి నుంచి నిష్క్రమించే సమయంలో సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహానికి నివాళులర్పించారు.  
ఆత్మ నిర్భర భారత్‌ దిశగా మిధాని

వైడ్‌ ప్లేట్‌ మిల్లును ప్రారంభిస్తున్న రాష్ట్రపతి ముర్ము


ప్రతి­ష్టా­త్మక అగ్ని క్షిపణితో పాటు అనేక రక్షణ రంగ అవసరా­లు తీర్చ­గల సరికొత్త వ్యవస్థను ఏర్పా­టు చేసుకోవడం ద్వారా మిశ్ర ధాతు నిగమ్‌ (మిధాని) ఆత్మ నిర్భర భారతం వైపు మేలి ముం­దడుగు వేసిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభి­నందించారు. మిధానిలో సుమారు రూ.500 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన వైడ్‌ ప్లేట్‌ మిల్లును రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇలాంటి మిల్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల భవిష్యత్తులో దిగుమ­తులు తగ్గుతాయన్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న మిధాని ప్రపంచంలోనే అత్యాధునిక లోహ ధాతు తయారీ సంస్థగా ఎదిగిందని, ఇది దేశానికే గర్వకారణమని కొనియాడారు. టైటానియంతో పాటు  అనేక ప్రత్యేక లక్షణాలున్న మిశ్ర ధాతువులు మిధానిలో తయారవుతున్నా­యని, ఇవి దేశ అంతరిక్ష, రక్షణ, ఇంధన, వ్యూహాత్మక రంగాల్లో కీలకం అవుతున్నా­యని వివరించారు.  

IPL 2023 Mini Auction Latest News : ఐపీఎల్ 2023 వేలంలో అత్యధికంగా ధ‌ర ప‌లికిన ఆట‌గాళ్లు వీరే..
భారత భవిష్యత్తు మీ భుజాలపైనే..!

భారత భవిష్యత్తు భారం యువ ఐపీఎస్‌ అధికారుల భుజ­స్కంధాలపైనే ఉందని, వారంతా భారత ప్రతిష్టను పెంచేలా కృషి చేస్తారన్న విశ్వా­సం ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. రాష్ట్రపతి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీ (ఎన్‌పీఏ)ని సందర్శించి, అకాడమీలో శిక్షణ పొందుతున్న 195 మంది 74వ బ్యాచ్‌ ట్రైనీ ఐపీఎస్‌ అధికారులనుద్దేశించి ఆమె ప్రసంగించారు. తొలుత ప్రతిష్టాత్మకమైన సేవలోకి అడుగు పెడుతున్న యువ ఐపీ ఎస్‌లకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వాల పనితీరును, ప్రతిష్టను పెంచే కీలక బాధ్యత పోలీస్‌ వ్యవస్థపై ఉందన్నారు. పౌరులకు ప్రభుత్వ సేవలు చేరువ చేయడంలో పోలీస్‌ అధికారుల వ్యక్తిత్వం, ప్రవర్తన కీలకమని సూచించారు. నేరాల కట్టడి, నేరాల దర్యాప్తు, ఉగ్రవాదం, మత ఘర్షణలు, వ్యవస్థీకృత నేరాల అదుపు వంటి సవాళ్లు పెరుగుతున్నాయని తెలిపారు. 

Corona Virus: కరోనా ఫోర్త్‌ వేవ్‌తో మనకు ముప్పు లేదు
పోలీసింగ్‌లో నాయకులుగా నిలవాలి

సమాజంలో మహిళలు ముఖ్యపాత్ర పోషి స్తు­న్నారని, గత మూడేళ్లుగా ఎన్‌పీఏ శిక్షణలో­నూ మహిళా అధికారులు సత్తా చాటుతూ టాపర్లుగా నిలిచారని రాష్ట్రపతి చెప్పా­రు. మరో 25 ఏళ్లలో భారతదేశం వందో వార్షికో­త్సవాన్ని జరుపుకోబోతోందని, భ­విష్య‌త్‌ భారత నిర్మాణంలో ఈ యువ అధికారులది కీలక పాత్ర అన్నారు.  

Published date : 28 Dec 2022 06:10PM

Photo Stories