Draupadi Murmu: తొలిసారి తెలంగాణకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి బొల్లారంలోని యుద్ధస్తూపం వద్దకు చేరుకొని దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర సైనికులకు నివాళి అర్పించారు. అనంతరం రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై రాత్రి ఏడున్నర గంటల సమయంలో రాజ్‌భవన్‌లో విందు ఇచ్చారు. గవర్నర్‌తో కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలోనే సీఎం విందుకు రాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్‌కు వచ్చి.. శ్రీశైలం వెళ్లొచ్చి..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలుత కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ గవర్నర్ తమిళిసై, మంత్రి సత్యవతిరాథోడ్ ఆమెకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లారు. దర్శనం, ప్రత్యేక పూజల అనంతరం శ్రీశైలం నుంచి హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకున్నారు.