Senior Actor Kaikala Satyanarayana : ప్రముఖ సినీనటుడు సీనియర్ నటుడు కైకాల కన్నుమూత.. ఈయన జీవిత ప్రస్థానం ఇలా..
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, కమెడియన్ ఇలా అన్నీ రకాల ప్రాతలను పోషించి తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు కైకాల. నిర్మాతగానూ సినిమాలు రూపొందించారు. ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందారు సత్యనారాయణ.
తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో కైకాల ఒకరు. కైకాల మరణ వార్తతో టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించేందుకు పలువురు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి తరలివస్తున్నారు.
కైకాల సత్యనారాయణ ప్రస్థానం ఇలా..
➤ కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో1935 జులై 25వ తేదీన కైకాల సత్యనారాయణ జన్మించారు
➤ గుడివాడ కళాశాల నుంచి పట్టభద్రుడైయ్యాడు.
➤ 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో వివాహం జరిగింది
➤ కైకాలకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు
➤ నవరస నటనా సార్వభౌముడిగా ప్రఖ్యాతిగాంచిన కైకాల.. 777 చిత్రాల్లో నటించిన కైకాల సత్యనారాయణ
➤ కైకాల సత్యనారాయణ నటించిన మొదటి చిత్రం: సిపాయి కూతురు
కైకాల సత్యనారాయణ నటించిన చివరి చిత్రం: మహర్షి
➤ సత్యనారాయణలోని టాలెంట్‌ను ప్రముఖ నిర్మాత డీఎల్ నారాయణ గుర్తించి ‘సిపాయి కూతురు’లో అవకాశం ఇచ్చారు.
➤ పౌరాణికం, జానపదం, కమర్షియల్.. ఇలా ఎన్నో చిత్రాల్లో హీరో, విలన్‌గా ఆయన కనిపించారు.
➤ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబుతో పాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తదితరుల చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో సత్యనారాయణ నటించారు.
►తన మనవళ్లలో ఒకరిని నటవారసుడిగా చూడాలనేది కైకాల కోరిక
►నవరస నటనా సార్వభౌముడిగా ప్రఖ్యాతిగాంచిన కైకాల
►ఐదు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కైకాల ప్రయాణం
►28 పౌరాణిక, 51 జానపద, 9 చారిత్రక చిత్రాల్లో నటించిన కైకాల
►200 మందికిపైగా దర్శకులతో పనిచేసిన కైకాల సత్యనారాయణ
►100 రోజులు ఆడిన కైకాల నటించిన 223 చిత్రాలు
►అర్ధశతదినోత్సవాలు జరుపుకున్న 59 సినిమాలు
►సంవత్సరం ఆడిన కైకాల నటించిన 10 చిత్రాలు
►ఇంటర్ రెండో సంవత్సరంలో నాటకరంగంలో కైకాల ప్రవేశం
►నాటకరంగ అనుభవంతో సినిమాల్లో వేషం కోసం మద్రాసు వెళ్లిన కైకాల
►కైకాల సత్యనారాయణ నటుడిగా గుర్తించిన డి.ఎల్.నారాయణ
►తొలి సినిమాతోనే కథానాయకుడి అవకాశాన్ని అందుకున్న కైకాల
►కైకాల సత్యనారాయణకు కలిసొచ్చిన ఎన్టీఆర్ పోలికలు
►కైకాలను ఎన్టీఆర్ కు నకలుగా భావించిన పరిశ్రమ పెద్దలు
►సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి చిత్రంలో తొలిసారిగా ఎన్టీఆర్ తో కలిసి నటించిన కైకాల
►విఠలాచార్య దర్శకత్వంలో తొలి ప్రతినాయకుడి వేషం వేసిన కైకాల
►కనకదుర్గ పూజ మహిమ చిత్రంలో తొలిసారి ప్రతినాయకుడి పాత్ర పోషించిన కైకాల
►ఎన్టీఆర్ అగ్గిపిడుగు చిత్రంతో మలుపుతిరిగిన కైకాల సినీ జీవితం
►ఎన్టీఆర్ తో కలిసి 101 చిత్రాల్లో నటించిన కైకాల సత్యనారాయణ
►ఎన్టీఆర్ తో పోరాట సన్నివేశాల్లో పోటాపోటీగా నటించిన కైకాల
►యమగోల, యమలీల చిత్రాల్లో యముడిగా అలరించిన కైకాల
►పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు పాత్రలు పోషించిన కైకాల
►సాంఘిక చిత్రాల్లో రౌడీ, తండ్రి, తాత పాత్రల్లో నటించిన కైకాల
►రమా ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థను స్థాపించిన కైకాల సత్యనారాయణ
►కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు చిత్రాలను నిర్మించిన కైకాల
►1994లో బంగారు కుటుంబం చిత్రానికి నంది పురస్కారం
►2011లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్న కైకాల
►కైకాలకు బాగా నచ్చిన సంభాషణ: నీవా పాండవ పత్ని
►1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కైకాల సత్యనారాయణ
►తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి లోక్ సభకు కైకాల ఎన్నిక
►తొలి రోజుల్లో ''రాముడు-భీముడు' వంటి ఎన్.టి.ఆర్. ద్విపాత్రాభినయ చిత్రాలలో ఆయనకు డూప్ గా నటించారు.
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు
➤ జీవితకాల సాఫల్య పురస్కారం (2017)
నంది అవార్డులు
➤ ఉత్తమ చలన చిత్రం - బంగారు కుటుంబం (1994)
➤ రఘుపతి వెంకయ్య అవార్డు - 2011
ఇతర గౌరవాలు
➤ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అవార్డు
➤నటశేఖర - అనంతపురంలో ఒక ప్రభుత్వేతర సంస్థ ఇచ్చింది.
➤నటశేఖర - గుడివాడ పురపాలక సంఘ వేదికపై ఇచ్చినది
➤ కళా ప్రపూర్ణ - కావలి సాంసృతిక సంఘంవారు ఇచ్చినది
➤నవరసనటనా సార్వభౌమ - ఒక సాంస్కృతిక సంఘం అనేకమంది పెద్దమనుషులు, పురజనుల మధ్య ఇచ్చింది.