Skip to main content

1st News Reader Shanti Swaroop Success Journey: అప్పట్లో ఆ వార్త సంచలనం.. ఆ సమయలో ఎన్టీఆర్‌ గారు స్వయంగా..

వార్తలను ఎంత బట్టి పట్టి చదివినా కూడా ప్రజలకు దగ్గర అవ్వలేము. కాని, ఆయన మొదటి వార్తకే ప్రజలంతా వార్తల సమయం కోసం ఎదురు చూసేలా నిలిచిపోయారు. ఆయనే న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌. ఆయన మీడియా జీవితం గురించి తెలుసుకుందాం..
Successful media life journey of first DD News Reader in Telugu Shanti Swaroop

సాక్షి ఎడ్యుకేషన్‌: శాంతి స్వరూప్‌.. తెలుగులో దూరదర్శన్‌ చానల్‌లో వార్తలను చదివి ప్రజలకు దగ్గరైన మొట్టమొదటి యాంకర్‌గా నిలిచిన వ్యక్తి. హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన శాంతి స్వరూప్‌ తన చిన్న వయస్సులోనే తండ్రి, తన అన్నయ్య కాలం చేయడంతో తన కుటుంబ భారాన్ని తానే మోసారు. 1977లో వృత్తిలో చేరేందుకు హైదరాబాద్‌ వచ్చిన ఆయన 1978లో వార్తలు చదివేందుకు దూరదర్శన్‌లో చేరారు. కాని, తన వార్తలను చదివి వినిపించేందుకు 5 సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది. అంటే, 1983లో నవంబర్‌ 14వ తేదీన బాలల దినోత్సవం సందర్భంగా శాంతి స్వరూప్‌ తన మొదటి వార్తను చదివారు.

Shanti Swaroop News Reader

మొదటి వార్త..

నమస్కారం.. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు.. బాలల దినోత్సవం సందర్భంగా లాల్ బహదూర్ స్టేడియంలో బాలల దినోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ టీ రామారావు ప్రారంభించారు… ఈ వార్త. ఇదే బులిటెన్‌ తెలుగులో మొదటి వార్త. అప్పట్లో ఇది ఒక సంచలనం.

Shanti Swaroop News Reader

ఆ సమయంలో ఆయన వార్తలను ఎంతో ఇష్టంగా చదివడంతోపాటు ప్రజలకు కూడా ఆయనంటే ఎంతో అభిమానం ఏర్పడింది. వార్తల సమయంలో ఆయన కోసం వేచి చూసేవారు.

చాలా కష్టంగా ఉండేది

అప్పట్లో టెలీ ప్రాంప్టర్‌ ఉండేది కాదు అయినప్పటికీ ఆయన ఒక్క తప్పు కూడా లేకుండా చదవాలని ఒకవైపు భయం ఉన్నా మరోవైపు వార్తలు చదవడంపై ఉన్న ఇష్టంతో బట్టీ పట్టి చదివేవారని ఆయన ఒక ఇంటర్య్వూలో తెలిపారు. ఉద్యోగంలో చేరిన ఐదు సంవత్సరాలకు వార్తలను చదివి వినిపించే అవకాశం దక్కిందని, టెలీ ప్రాంప్టర్‌ లేకపోయినా తప్పులు జరగకుండా చాలా జాగ్రత్తగా బట్టీ పట్టి చదివేవాడినని.. కానీ, ఇవ్వన్నీ చూసి మిగిలిన వారంతా భయపడేవారని అప్పటి జ్ఞాపకాలను ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ గుర్తు చేసుకున్నారు శాంతి స్వరూప్‌.. 

కుటుంబం

Shanti Swaroop Family

ఎంతో ఇష్టంగా, శ్రద్ధతో వార్తలను చదివే శాంతి స్వరూప్‌ 1980లో తన సహ సీనియర్‌ యాంకర్‌ అయిన రోజా రాణిని తన జీవిత భాగస్వామిగా చేసకున్నారు. వారికి ఇద్దరు కుమారులే. ప్రస్తుతం, వారిద్దరూ ఐఐటీ చేసి అమెరికాలో స్థిరపడ్డారు.

గురువు కూడా

మీడియా వృత్తిలో చేరి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న శాంతి స్వరూప్‌ ఇప్పుడు ఉన్న ఎందరో న్యూస్‌ రీడర్లకు స్పూర్తి, గురువు కూడా. ఆయన శిక్షణలో మీడియా రంగంలో ఎత్తుకు ఎదిగిన వారు చాలానే ఉన్నారు.

ప్రజలు వేచి చూసేంతలా 

ఎంతో ఇష్టంగా ప్రజలకు అర్థం అయ్యేలా, వార్తలు చదివేవారు శాంతి స్వరూప్‌. తెలుగులో మొదట వార్తలు చదివిన వ్యక్తిగా నిలిచారు. వార్తలను చదవడమే కాకుండా ప్రజలు ఇష్టంగా వినేలా, వార్తలు ఎప్పుడు ప్రారంభమవుతాయని ఎదురుచూసేలా చదవడం ఆయనకే సాధ్యమైంది.

Felicitation

న్యూస్‌ రీడర్‌గా చేయాలన్న ఆశతో డీడీ లో చేరిన తరువాత ఆయన ఐదు సంవత్సరాల కృషి తరువాత బాలల దినోత్సవం సందర్భంగా తొలిసారి చదివి విజయాన్ని పొందారు..

Published date : 08 Apr 2024 12:58PM

Photo Stories