Good News: ఈ కేంద్ర పథకం ద్వారా మీకు రూ.15 లక్షలు వస్తాయ్..! మీరు ఇలా చేస్తే..
![](/sites/default/files/images/2022/12/26/modi-1672059284.jpg)
ఈ తరహాలోనే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ (FPOల) పేరుతో మరో పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా రైతులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.
రూ. 15 లక్షల వరకు..
![farmers producer organisation scheme details telugu](/sites/default/files/inline-images/modi.1.917771.jpg)
అనగా రైతులకు ప్రధానమంత్రి ఎఫ్‌పిఓ పథకం కింద రూ. 15 లక్షల వరకు సహాయం అందిస్తారు. తద్వారా వారు వ్యవసాయ పరిశ్రమలో ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అయితే రైతులు వ్యవసాయం, వ్యాపారం చేసేందుకు సహకరించే ఈ పథకం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు కూడా. దీని కింద రైతులకు అందించే డబ్బులను వ్యవసాయ పనిముట్లు, ఎరువులు సహా ఇతరాత్రా సాగు సంబంధ వ్యాపార అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అయితే ఇందుకోసం, 11 మంది రైతులు కలిసి ఒక సంస్థని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం రూ.15 లక్షలు వరకు గ్రాంట్ ఆఫ్ మ్యాచింగ్ ఈక్విటీ ఇస్తుంది. అందుకోసం ప్రభుత్వ వెబ్‌సైట్ ఈనాం (ENAM) లో నమోదు కావాల్సి ఉంటుంది.
దీని ద్వారా..
![farmers](/sites/default/files/images/2023/01/21/farmer-1674273106.jpg)
కేంద్రం 2023-24 నాటికి 10,000 ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రభుత్వం ఐదేళ్లపాటు వీటికి సాయం అందిస్తుంది. ఒక్కో ఎఫ్‌పీవోకు మోదీ సర్కార్ రూ.15 లక్షల రుణం అందిస్తుంది. దీని ద్వారా ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేసుకొని పనులు ప్రారంభించొచ్చు.