Skip to main content

Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో.. జొకోవిచ్‌కు గ‌ట్టిపోటీనిచ్చిన‌ తెలుగు సంతతి అమెరికన్ టీనేజర్

రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్‌సింగిల్స్‌ టైటిల్‌ లక్ష్యంగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ బరిలోకి దిగిన సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ తొలి అడ్డంకిని అధిగమించాడు.
Novak Djokovic Reserves Huge Praise For Fanboy Nishesh Basavareddy In Australian Open

ప్రపంచ 107వ ర్యాంకర్, అమెరికన్‌ రైజింగ్‌ టీనేజ్‌ టెన్నిస్‌ స్టార్‌ నిశేష్‌ బసవరెడ్డితో జరిగిన తొలి రౌండ్‌ పోరులో జొకోవిచ్‌ గెలిచి 18వ సారి ఈ టోర్నీలో రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. 2 గంటల 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో నిశేష్‌ 6–4, 3–6, 4–6, 2–6తో జొకోవిచ్‌ చేతిలో పోరాడి ఓడిపోయాడు. 
 
నిశేష్ వ్యక్తిగత వివరాలు
నిశేష్ బసవరెడ్డి 2005లో అమెరికాలో పుట్టి పెరిగాడు. అతని తల్లిదండ్రులు మురళీ రెడ్డి, సాయిప్రసన్న నెల్లూరు జిల్లాకు చెందినవారు. 1999లో కుటుంబం ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లింది. నిశేష్ స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశాడు.

ప్రైజ్‌మనీ, ర్యాంకింగ్
తొలి రౌండ్‌లో ఓడిన  నిశేష్‌కు 1,32,000 ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ.70 లక్షల 47 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 10 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టోర్నీ ముగిసిన తర్వాత, నిశేష్ 104వ ర్యాంక్ కు చేరుకుంటాడు. 

Sports Awards: తెలుగు తేజాలు దీప్తి, జ్యోతిలకు ‘అర్జున’ అవార్డు

ఇతర ప్లేయర్ల ఫలితాలు..
సిట్సిపాస్ (11వ సీడ్), 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నరప్, తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. అతను 5–7, 3–6, 6–2, 4–6తో మికిల్సన్ (అమెరికా) చేత ఓడిపోయాడు. ఇతర ఫలితాల్లో, సినెర్ (ఇటలీ) 7–6 (7/2), 7–6 (7/5), 6–1తో నికోలస్ (చిలీ)పై విజయం సాధించాడు. అల్‌కరాజ్ (స్పెయిన్) 6–1, 7–5, 6–1తో షెవ్‌చెంకో (కజకిస్తాన్)పై విజయాన్ని నమోదు చేశాడు. 

జొకోవిచ్ రికార్డులు
21వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ విజయంతో జొకోవిచ్ 21వ ఏడాదికీ (1968 నుంచి) గ్రాండ్‌స్లామ్ సాధించడాన్ని కొనసాగిస్తున్నాడు. 429 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ మ్యాచ్‌లు ఆడిన ఫెడరర్ రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్‌లో జొకోవిచ్ అడుగు పెడితే, ఫెడరర్ రికార్డును అధిగమిస్తాడు.

ASB Classic: ఏటీపీ-250 టెన్నిస్ టోర్నీ సెమీఫైనల్లో ఓడిన యూకీ-ఒలివెట్టి జోడీ

Published date : 16 Jan 2025 09:02AM

Photo Stories