Lifetime MCC Membership: మిథాలీ, ధోని, యువరాజ్‌లకు ఎంసీసీ జీవితకాల సభ్యత్వం
Sakshi Education
క్రికెట్ నియమావళికి కేంద్ర బిందువైన విఖ్యాత మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) 17 మంది మేటి క్రికెటర్లకు జీవితకాల సభ్యత్వం కల్పించింది.
ఈ జాబితాలో భారత్ నుంచి ఐదుగురు క్రికెటర్లు ఉన్నారు. అంతర్జాతీయ మహిళల క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, పేస్ బౌలర్ జులన్ గోస్వామిలతోపాటు ఎమ్మెస్ ధోని, యువరాజ్ సింగ్, సురేశ్ రైనాలకు ఈ గౌరవం దక్కింది. ధోని నాయకత్వంలో భారత్ 2007 టి20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్ టైటిల్స్ సాధించింది.
యువరాజ్ సింగ్ ఈ రెండు గొప్ప విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. సురేశ్ రైనా తన 13 ఏళ్ల కెరీర్‌లో మూడు ఫార్మాట్‌లలో కలిపి 7,988 పరుగులు సాధించాడు. హైదరాబాద్‌కు చెందిన మిథాలీ రాజ్ వన్డేల్లో అత్యధిక పరుగులు (7,805) చేసిన మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. అత్యధిక మ్యాచ్‌ల్లో (155) కెప్టెన్‌గా వ్యవహరించిన ప్లేయర్‌గానూ ఆమె గుర్తింపు పొందింది. జులన్ వన్డేల్లో అత్యధిక వికెట్లు (255) తీసిన బౌలర్‌గా ఘనత వహించింది.
IPL 2023 New Rules: ఐపీఎల్‌లో సంచలనం రేకెత్తించే కొత్త రూల్స్ ఇవే..
Published date : 06 Apr 2023 03:34PM