MS Dhoni: చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
Sakshi Education
టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్‌కే స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని టీ20 క్రికెట్‌లో 300 వికెట్ల మైలురాయిని అధిగమించి చరిత్ర సృష్టించాడు.
ఐపీఎల్ 2024 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా క్యాచ్‌ను అందుకున్న ధోని ఈ ఘనతను సాధించాడు.
ఈ జాబితాలో మరే వికెట్ కీపర్ ధోనీకి దరిదాపుల్లో కూడా లేరు. ఈ జాబితాలో ధోనీ(300) అగ్రస్థానంలో ఉండగా కమ్రాన్ అక్మల్(274), దినేశ్ కార్తీక్(274) రెండో స్థానంలో కొనసాగుతున్నారు. క్వింటన్ డికాక్(270), జోస్ బట్లర్(209) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఢిల్లీ చేతిలో 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సీఎస్‌కే ఓటమిపాలైనప్పటికి.. ఎంఎస్ ధోని మాత్రం మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. 8వ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 16 బంతులు మాత్రమే ఎదుర్కొన్న మిస్టర్ కూల్.. 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
IPL 2024: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు ఇదే..
Published date : 01 Apr 2024 03:08PM