World Cup 2023: ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చెత్త రికార్డు
ప్రపంచకప్ చరిత్రలో అన్ని టెస్ట్ ప్లేయింగ్ జట్ల (11) చేతుల్లో ఓడిన తొలి జట్టుగా రికార్డుల్లోకెక్కింది. 1975 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన ఇంగ్లండ్.. ఆతర్వాత 1979 వరల్డ్‌కప్ ఫైనల్లో వెస్టిండీస్ చేతిలో పరాజయాన్ని మూటగట్టుకుంది. అనంతరం 1983, 1987 ప్రపంచకప్‌ల్లో భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్ చేతుల్లో ఓడిన ఇంగ్లండ్.. 1992 వరల్డ్‌కప్‌లో పసికూన జింబాబ్వే చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.
Cricket in Olympics: 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్
1996 ప్రపంచకప్‌లో శ్రీలంక, సౌతాఫ్రికా చేతుల్లో పరాజయాలు ఎదుర్కొన్న ఇంగ్లీష్ టీమ్‌కు 2011 ప్రపంచకప్‌లో ఊహించని పరాభవం ఎదురైంది. ఈ ఎడిషన్‌లో ఆ జట్టు ఐర్లాండ్ చేతిలో ఓటమిపాలైంది. 2015లో ఇంగ్లండ్‌కు మరో షాక్ తగిలింది. ఆ ఎడిషన్‌లో ఇంగ్లీష్ టీమ్.. బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపాలైంది. తాజా వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమితో, అన్ని టెస్ట్ ప్లేయింగ్ దేశాల చేతుల్లో ఓటములు ఎదుర్కొన్న తొలి జట్టుగా ఎవరికీ సాధ్యంకాని చెత్త రికార్డును ఇంగ్లండ్ మూటగట్టుకుంది.
IOC Bans Russian Olympic Committee: రష్యా ఒలింపిక్ కమిటీపై నిషేధం
కాగా, న్యూఢిల్లీ వేదికగా నిన్న (అక్టోబర్ 15) జరిగిన మ్యాచ్‌లో పసికూన ఆఫ్ఘనిస్తాన్.. జగజ్జేత ఇంగ్లండ్‌ను 69 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో తడబడిన ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.