IOC Bans Russian Olympic Committee: రష్యా ఒలింపిక్ కమిటీపై నిషేధం
Sakshi Education
ఒలింపిక్ నియమావళిని ఉల్లంఘించినందుకు రష్యా ఒలింపిక్ కమిటీపై అంతర్జాతీయ ఒలింపిక్ కౌన్సిల్ (ఐఓసీ) నిషేధం విధించింది.
ముంబైలో గురువారం జరిగిన ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రష్యాపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని... తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుంది. అయితే ఈ నిర్ణయంవల్ల రష్యా క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ఐఓసీ తెలిపింది. అంతర్జాతీయ ఈవెంట్స్‌లో, వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో రష్యా క్రీడాకారులు స్వతంత్ర క్రీడాకారులుగా పోటీపడవచ్చని ఐఓసీ వివరణ ఇచ్చింది.
Published date : 14 Oct 2023 09:55AM