Skip to main content

Common wealth games 2022 : భారత్‌ నాలుగో స్థానంలో

ఇంగ్లండ్ లోని బర్మింగ్ హమ్ లో 12 రోజులపాటు కొనసాగిన కామన్వెల్త్‌ క్రీడోత్సవం ఆగస్టు 8తో ముగిసింది.
Common wealth games 2022 India at 4th place
Common wealth games 2022 India at 4th place

మొత్తం 216 మంది క్రీడాకారులతో బరిలోకి దిగిన భారత్‌ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి 61 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. 67 స్వర్ణాలు, 57 రజతాలు, 54 కాంస్యాలతో కలిపి 178 పతకాలతో ఆస్ట్రేలియా మొదటిస్థానంలో నిలిచింది. 176 పతకాలతో ఇంగ్లండ్ రెండో స్థానంలో, 92 పతకాలతో కెనెడా మూడో స్థానంలో నిలిచాయి. 

Also read: Commonwealth Games 2022 : ఫైనల్లో అదరగొట్టిన రాంకీ రెడ్డి- చిరాగ్‌ శెట్టి.. భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం..

2018 గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో  భారత్‌ 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యాలతో కలిపి 66 పతకాలు గెలిచి మూడో స్థానంలో నిలిచింది. అయితే గోల్డ్‌కోస్ట్‌ గేమ్స్‌లో షూటింగ్‌ క్రీడాంశంలో భారత్‌ ఏకంగా 16 పతకాలు సొంతం చేసుకుంది. 2022 క్రీడాపోటీల్లో షూటింగ్‌ క్రీడాంశాన్ని నిర్వహించలేదు. ఫలితంగా భారత్‌ పతకాల ర్యాంక్‌లో ఒక స్థానం పడిపోయింది. ఒకవేళ షూటింగ్‌ కూడా బర్మింగ్‌హామ్‌ గేమ్స్‌లో ఉండి ఉంటే భారత్‌ పతకాల సంఖ్యలోనూ, తుది ర్యాంక్‌లోనూ మరింత మెరుగయ్యేది.  

Also read: సాకేత్‌–యూకీ జంటకు Luxembourg టెన్నిస్ టైటిల్‌

క్రీడాంశం పతకాలు
రెజ్లింగ్‌ 12
వెయిట్‌లిఫ్టింగ్‌ 10
అథ్లెటిక్స్‌ 8
బాక్సింగ్‌ 7
టేబుల్‌ టెన్నిస్‌ 7
బ్యాడ్మింటన్‌ 6
జూడో 3
హాకీ 2
లాన్‌ బౌల్స్‌ 2
స్క్వాష్ 2
టి20 క్రికెట్‌ 1
పారా పవర్‌లిఫ్టింగ్‌ 1

ఆఖరి రోజు.. 6 పతకాలు 

అంచనాలకు అనుగుణంగా మెరిసిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ముచ్చటగా మూడో ప్రయత్నంలో కామన్వెల్త్‌ గేమ్స్‌ చాంపియన్‌గా అవతరించింది. 2014 గ్లాస్గో గేమ్స్‌లో కాంస్యం... 2018 గోల్డ్‌కోస్ట్‌ గేమ్స్‌లో రజతం నెగ్గిన సింధు,  ఆగస్టు 8న ముగిసిన బర్మింగ్ హమ్ కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఏడో ర్యాంకర్‌ సింధు 21–15, 21–13తో 13వ ర్యాంకర్, 2014 గేమ్స్‌ స్వర్ణ పతక విజేత మిషెల్లి లీ (కెనడా)పై గెలిచింది. 2014 గేమ్స్‌ సెమీఫైనల్లో మిషెల్లి లీ చేతిలో ఓడిన సింధు, 2018 గేమ్స్‌ సెమీఫైనల్లో మిషెల్లి లీని ఓడించి ఫైనల్‌ చేరి తుది పోరులో సైనా నెహ్వాల్ చేతిలో పరాజయం పాలైంది. మూడోసారి మిషెల్లి లీపై గెలుపుతో సింధు విజేతగా నిలిచింది. 

Also read: Commonwealth Games 2022 : స్వర్ణ పతకం గెలిచిన తెలుగు తేజం PV సింధు.. ఇదే తొలి స్వర్ణం

కామన్వెల్త్‌ గేమ్స్‌ మహిళల సింగిల్స్‌లో స్వర్ణం గెలిచిన రెండో భారతీయ క్రీడాకారిణి  సింధు. గతంలో సైనా నెహ్వాల్ (2010, 2018) రెండుసార్లు పసిడి పతకాలు సాధించింది. కామన్వెల్త్‌ గేమ్స్‌ బ్యాడ్మింటన్‌ వ్యక్తిగత విభాగంలో అత్యధిక పతకాలు నెగ్గిన భారతీయ ప్లేయర్‌గా సింధు (3 పతకాలు) నిలిచింది. గతంలో అపర్ణా పోపట్‌ (1998లో రజతం; 2002లో కాంస్యం), సైనా రెండు పతకాల చొప్పున సాధించారు. 

Also read: World Athletics U 20: రూపల్‌ చౌదరీకి కాంస్యం

పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జంట భారత్‌కు తొలిసారి స్వర్ణ పతకాన్ని అందించింది. 2018 గోల్డ్‌కోస్ట్‌ గేమ్స్‌లో రజతం సాధించిన సాత్విక్‌–చిరాగ్‌ జోడీ ఈసారి మాత్రం బంగారు పతకాన్ని దక్కించుకుంది. ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్‌ సాయిరాజ్, మహారాష్ట్ర ప్లేయర్‌ చిరాగ్‌ శెట్టి 21–15, 21–13తో బెన్‌ లేన్‌–సీన్‌ వెండీ (ఇంగ్లండ్‌) జట్టును ఓడించారు. ఈ గెలుపుతో కామన్వెల్త్‌ గేమ్స్‌ పురుషుల డబుల్స్‌ విభాగంలో పసిడి పతకం నెగ్గిన తొలి భారతీయ జోడీగా సాత్విక్‌–చిరాగ్‌ గుర్తింపు పొందింది. 2010 ఢిల్లీ కామన్వెల్త్‌ గేమ్స్‌లో మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల–అశ్విని పొన్నప్ప జంట స్వర్ణం సాధించాక డబుల్స్‌లో భారత్‌కు లభించిన రెండో స్వర్ణం ఇదే కావడం విశేషం.  

Also read: World under - 20 Atheletics భారత రిలే జట్టుకి రజతం

టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ)లో భారత సీనియర్‌ క్రీడాకారుడు ఆచంట శరత్‌ కమల్‌ 16 ఏళ్ల తర్వాత మళ్లీ కామన్వెల్త్‌ గేమ్స్‌ పురుషుల సింగిల్స్‌లో స్వర్ణం సాధించాడు. ఫైనల్లో 40 ఏళ్ల శరత్‌ 11–13, 11–7, 11–2, 11–6, 11–8తో లియామ్‌ పిచ్‌ఫోర్డ్‌ (ఇంగ్లండ్‌)పై గెలిచాడు. తమిళనాడుకు చెందిన శరత్‌ కమల్‌ చివరిసారి 2006 మెల్‌బోర్న్‌ గేమ్స్‌లో సింగిల్స్‌లో బంగారు పతకం గెలిచాడు. శరత్‌ కమల్‌ అన్ని కామన్వెల్త్‌ క్రీడల్లో కలిపి మొత్తం 13 పతకాలు గెలిచాడు .    

Also read: CWG 2022 : మీరాబాయి చానుకి స్వర్ణం
 
భారత్‌కే చెందిన మరో అగ్రశ్రేణి ప్లేయర్‌ సత్యన్‌ జ్ఞానశేఖరన్‌ పురుషుల సింగిల్స్‌లో తొలిసారి కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. కాంస్య పతక పోరులో తమిళనాడుకు చెందిన సత్యన్‌ 11–9, 11–3, 11–5, 8–11, 9–11, 10–12, 11–9తో పాల్‌ డ్రింక్‌హాల్‌ (ఇంగ్లండ్‌)పై విజయం సాధించాడు.  

Also read: Hungarian Grand Prix 2022 : విజేత వెర్‌స్టాపెన్‌

కామన్వెల్త్‌ గేమ్స్‌ పురుషుల హాకీలో భారత జట్టు పసిడి కల ఇప్పట్లో నెరవేరేలా లేదు. మూడోసారి ఫైనల్‌ ఆడిన టీమిండియా మళ్లీ రజత పతకంతో సరిపెట్టుకుంది. ఆ్రస్టేలియాతో జరిగిన ఫైనల్లో భారత్‌ 0–7 గోల్స్‌ తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. 2010 ఢిల్లీ గేమ్స్‌లో, 2014 గ్లాస్గో గేమ్స్‌లోనూ ఆసీస్‌ చేతిలోనే భారత్‌ ఓడి రజత పతకాలు సాధించింది.  

Also read: Chess Olympiad 2022: చెన్నైలో ప్రారంభించిన ప్రధాని మోదీ

కామన్వెల్త్‌ గేమ్స్‌లో 1998లో తొలిసారి హాకీని ప్రవేశపెట్టగా అప్పటి నుంచి ఇప్పటివరకు పురుషుల విభాగంలో ఆ్రస్టేలియా ఏడుసార్లు విజేతగా నిలిచింది.

Also read: World Athletics Championships: అథ్లెట్‌ సిడ్నీ మెక్‌లాఫ్లిన్‌ ప్రపంచ రికార్డు

భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ 1998 కౌలాలంపూర్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో టీమ్‌ విభాగంలో రజతం, వ్యక్తిగత విభాగంలో కాంస్యం సాధించారు. 24 ఏళ్ల తర్వాత గోపీచంద్‌ కుమార్తె గాయత్రి బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో మహిళల డబుల్స్‌లో భాగస్వామి ట్రెసా జాలీతో కలిసి కాంస్య పతకం సాధించింది. తద్వారా  తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది.   

Also read: World Athletics Championships: నోరా జెరుటోకు స్వర్ణం

పాక్.. నదీమ్.. అద్భుతం
కామన్వెల్త్‌ గేమ్స్‌ జావెలిన్‌ త్రో ఈవెంట్‌లో పాకిస్తాన్‌ అథ్లెట్‌ నదీమ్‌ అద్భుతం చేశాడు. ఫైనల్లో నదీమ్‌ జావెలిన్‌ను 90.18 మీటర్ల దూరం విసిరి స్వర్ణం సాధించాడు. ఈ క్రమంలో జావెలిన్‌ను 90 మీటర్లకు పైగా విసిరిన రెండో ఆసియా అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. 2017లో చైనీస్‌ తైపీ అథ్లెట్‌ 91.36 మీటర్ల దూరం విసిరాడు. నదీమ్‌ ప్రదర్శనతో పాక్‌ 56 ఏళ్ల తర్వాత కామన్వెల్త్‌ గేమ్స్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో పతకం గెలిచింది. 

Also read: World Athletics: ప్రపంచ అథ్లెటిక్స్‌ నుంచి రష్యా ఔట్‌

Published date : 09 Aug 2022 06:44PM

Photo Stories