Commonwealth Games 2022: ఫైనల్లో అదరగొట్టిన రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి.. భారత్ ఖాతాలో మరో స్వర్ణం..
Sakshi Education
కామన్ వెల్త్ గేమ్స్-2022లో అఖరి రోజు భారత్ పతకాలు మొత మోగిస్తుంది. తాజాగా భారత్ ఖాతాలో మరో పసిడి పతకం చేరింది.
బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్‌లో రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడీ గోల్డ్ మెడల్ సాధించింది. బర్మింగ్‌హామ్ వేదికగా ఆగస్టు 8వ తేదీన (సోమవారం) జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌కు చెందిన బెన్ లేన్- సీన్ వెండీ జోడీని 21-15, 21-13 తేడాతో రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి ఓడించారు. అంతకుముందు తెలుగు తేజం పీవీ సింధు.. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించగా, పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. భారత్ ఇప్పటి వరకు 21 పసిడి, 15 రజత, 23 కాంస్య పతకాలు సాధించి మొత్తంగా 59 మెడల్స్‌తో పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.
Commonwealth Games 2022 : బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మరో స్వర్ణం.. ఈ గేమ్‌లో..
Commonwealth Games 2022 : స్వర్ణ పతకం గెలిచిన తెలుగు తేజం PV సింధు.. ఇదే తొలి స్వర్ణం
Published date : 08 Aug 2022 07:07PM