Commonwealth Games 2022 : బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మరో స్వర్ణం.. ఈ గేమ్‌లో..
తద్వారా పసిడి పతకం గెలిచాడు. కాగా అంతకుముందు తెలుగు తేజం పీవీ సింధు.. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది.
Commonwealth Games 2022 : స్వర్ణ పతకం గెలిచిన తెలుగు తేజం PV సింధు.. ఇదే తొలి స్వర్ణం
హోరాహోరీగా సాగిన గేమ్‌లో..
ఇక లక్ష్య సేన్ ఆగస్టు 8వ తేదీన (సోమవారం) నాటి మెన్స్ సింగిల్స్ ఫైనల్లో మలేషియా షట్లర్ ఎన్‌జీ జీ యోంగ్‌తో తలపడ్డాడు. హోరాహోరీగా సాగిన మొదటి గేమ్‌లో లక్ష్య సేన్ 19-21తో వెనుకబడ్డాడు. అయితే, రెండో గేమ్‌లో పుంజుకున్న అతడు 21-9తో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. ఇక ఆఖరి గేమ్‌లో ఆధిపత్యం కొనసాగిస్తూ 21-16తో లక్ష్య సేన్ యోంగ్‌ను ఓడించి స్వర్ణం ఖాయం చేసుకున్నాడు. కాగా లక్ష్య సేన్ గెలుపుతో భారత్ ఖాతాలో 20వ పసిడి పతకం చేరింది. ఇక భారత బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భారత్‌కు రజత పతకం లభించిన విషయం తెలిసిందే. గత మంగళవారం అర్థరాత్రి మలేషియాతో జరిగిన మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో 3-1 తేడాతో ఓడిన టీమిండియా రజతంతో సరిపెట్టుకుంది. పీవీ సింధు మినహా మిగతావారు ఓటమి పాలవడంతో స్వర్ణం గెలవాలన్న ఆశలు నెరవేరలేదు. భారత్ ఇప్పటి వరకు 20 పసిడి, 15 రజత, 23 కాంస్య పతకాలు సాధించి మొత్తంగా 58 మెడల్స్‌తో పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.