Skip to main content

World Athletics Championships: అథ్లెట్‌ సిడ్నీ మెక్‌లాఫ్లిన్‌ ప్రపంచ రికార్డు

ప్రపంచ రికార్డు సాధించినందుకు సిడ్నీకి లక్ష డాలర్లు (రూ. 79 లక్షల 84 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
World Records broken at the World Athletics Championships
World Records broken at the World Athletics Championships

అమెరికాలోని యుజీన్‌ వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా జూలై 23న జరిగిన మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్‌ ఈవెంట్‌లో 22 ఏళ్ల సిడ్నీ మెక్‌లాఫ్లిన్‌ 50.68 సెకన్లలో గమ్యానికి చేరి తొలిసారి స్వర్ణ పతకం సొంతం చేసుకోవడంతోపాటు ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రపంచ రికార్డు సాధించినందుకు సిడ్నీకి లక్ష డాలర్లు (రూ. 79 లక్షల 84 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఫెమ్కే బోల్‌ (నెదర్లాండ్స్‌; 52.27 సెకన్లు) రజతం, దాలియా మొహమ్మద్‌ (అమెరికా; 53.13 సెకన్లు) కాంస్యం సాధించారు. బంగారు పతకం గెలిచే క్రమంలో సిడ్నీ గత నెల 25న 51.41 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును సవరించింది. గత 13 నెలల కాలంలో సిడ్నీ ప్రపంచ రికార్డును తిరగరాయడం ఇది మూడోసారి.

Also read: Daily Current Affairs in Telugu: 2022, జులై 27th కరెంట్‌ అఫైర్స్‌

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 28 Jul 2022 01:26PM

Photo Stories