Skip to main content

National Games 2023: జాతీయ క్రీడల్లో చికితకు పసిడి ప‌త‌కం

జాతీయ క్రీడల్లో తెలంగాణకు మూడో స్వర్ణ పతకం లభించింది. ఆదివారం జరిగిన మహిళల ఆర్చరీ కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో తణిపర్తి చికిత పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.
Women's Archery Individual Gold Medalist, National Games, Champion Archer Taniparthi Chikita at National Games 2023, Celebrating the Victory of Taniparthi Chikita in Archery, National Games 2023 Compound Archery Gold Medal Winner, National Games 2023, Gold medalist Taniparthi Chikita in Women's Archery,
National Games 2023

పెద్దపల్లి జిల్లా సుల్తానాపూర్‌ గ్రామానికి చెందిన చికిత ఫైనల్లో 143–142తో ప్రియా గుర్జర్‌ (రాజస్తాన్‌)పై గెలిచింది. మరోవైపు మహిళల టెన్నిస్‌ ఈవెంట్‌లో తెలంగాణ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక మూడో పతకాన్ని దక్కించుకుంది.

Paris Masters 2023 : పారిస్‌ ఓపెన్‌ మాస్టర్స్‌లో రన్నరప్‌గా బోపన్న–ఎబ్డెన్ జోడి

మహిళల టీమ్‌ విభాగంలో కాంస్యం నెగ్గిన రష్మిక... డబుల్స్‌ విభాగంలో శ్రావ్య శివానితో రజతం సాధించింది. ఆదివారం జరిగిన సింగిల్స్‌ విభాగంలో రష్మిక రజత పతకం సొంతం చేసుకుంది. వైదేహి (గుజరాత్‌)తో జరిగిన టైటిల్‌ పోరులో రష్మిక 5–7, 6–7 (3/7)తో పోరాడి ఓడిపోయింది. 

Women's Asian Hockey Champions Trophy: ఆసియా మహిళల హాకీ చాంపియన్స్‌ ట్రోఫీలో విజేతగా భారత్‌

Published date : 07 Nov 2023 11:05AM

Photo Stories