Skip to main content

Chess World Cup 2023: చెస్‌ ప్రపంచకప్‌ విజేత‌గా మాగ్నస్‌ కార్ల్‌సన్‌

గత దశాబ్దకాలంగా పురుషుల చెస్‌లో మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు ఎదురులేదు. ఈ నార్వే సూపర్‌స్టార్‌ క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్‌ ఫార్మాట్‌లలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు.
Chess World Cup 2023
Chess World Cup 2023

చెస్‌లో అత్యుత్తమ రేటింగ్‌ కూడా అందుకున్నాడు. అయితే అగ్రశ్రేణి చెస్‌ ఆటగాళ్ల మధ్య రెండేళ్లకోసారి నాకౌట్‌ పద్ధతిలో జరిగే ప్రపంచకప్‌ టోర్నీలో మాత్రం కార్ల్‌సన్‌ శిఖరాన నిలువలేకపోయాడు. ఈసారి మాత్రం నిలకడైన ఆటతీరుతో కార్ల్‌సన్‌ తన కెరీర్‌లో తొలిసారి ప్రపంచకప్‌ టైటిల్‌ను సాధించాడు.

World Senior Shooting Championship: ప్ర‌పంచ సీనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో అమన్‌ప్రీత్‌ సింగ్‌కు స్వర్ణం

కార్ల్‌సన్‌కు టైటిల్‌ దక్కినా అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానందనే. తన అసమాన పోరాటపటిమతో... ఊహకందని ఎత్తులతో... తనకంటే ఎంతో మెరుగైన ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తూ... తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల ఈ టీనేజర్‌ రెండో ప్రయత్నంలోనే ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరాడు. కార్ల్‌సన్‌కు ఆద్యంతం గట్టిపోటీనిచ్చాడు. అనుభవలేమితో తుది మెట్టుపై తడబడ్డా... భవిష్యత్‌లో ప్రపంచ చాంపియన్‌ అయ్యే లక్షణాలు తనలో పుష్కలంగా ఉన్నాయని ప్రజ్ఞానంద చాటుకున్నాడు.   

National Inter Institutional Table Tennis: శ్రీజకు స్వర్ణం

గత 25 రోజులుగా అజర్‌బైజాన్‌ రాజధాని బాకులో జరిగిన ప్రపంచకప్‌ టో ర్నీలో ఆరంభం నుంచి మేటి ఆటగాళ్లను మట్టికరిపించిన ఈ తమిళనాడు కుర్రాడు తుదిపోరులో నార్వే దిగ్గజం మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను బోల్తా కొట్టించలేకపోయాడు.
నిర్ణీత రెండు క్లాసికల్‌ గేముల్లో ప్రజ్ఞానంద నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొని ‘డ్రా’తో సంతృప్తి పడ్డ 32 ఏళ్ల కార్ల్‌సన్‌ టైబ్రేక్‌లోని ర్యాపిడ్‌ గేముల్లో తన అనుభవాన్నంతా ఉపయోగించి గట్టెక్కాడు. తొలి గేమ్‌లో నల్ల పావులతో ఆడిన కార్ల్‌సన్‌ 47 ఎత్తుల్లో ప్రజ్ఞానందపై గెలుపొంది... రెండో గేమ్‌లో తెల్ల పావులతో ఆడి 22 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని ఓవరాల్‌గా 2.5–1.5తో విజయాన్ని ఖరారు చేసుకున్నాడు.

India Mens Junior Hockey: జూనియర్ పురుషుల హాకీలో రన్నరప్‌గా భారత

ఒక్కో రౌండ్‌ దాటి...  

2019 ప్రపంచకప్‌లో తొలిసారి బరిలోకి దిగిన ప్రజ్ఞానంద నాలుగో రౌండ్‌లో వెనుదిరిగాడు. ఈసారి మాత్రం ఈ తమిళనాడు కుర్రాడు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ఈ టోర్నీ చరిత్రలో ఫైనల్‌ చేరిన రెండో భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్‌ నుంచి ఓపెన్‌ విభాగంలో పది మంది గ్రాండ్‌మాస్టర్లు పోటీపడగా ఒకరు ఫైనల్‌కు, మరో ముగ్గురు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరడం విశేషం.  
విజేతగా నిలిచిన కార్ల్‌సన్‌కు 1,10,000 డాలర్లు (రూ. 90 లక్షలు), రన్నరప్‌ ప్రజ్ఞానందకు 80 వేల డాలర్లు (రూ. 66 లక్షలు), మూడో స్థానం పొందిన కరువానాకు 60 వేల డాలర్లు (రూ. 49 లక్షలు)... నాలుగో స్థానంలో నిలిచిన అబసోవ్‌కు 50 వేల డాలర్లు (రూ. 41 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

Open Masters-1000 Title Winner: సిన్సినాటి ఓపెన్‌ మాస్టర్స్‌–1000 టైటిల్‌ విజేత‌గా జొకోవిచ్‌

Published date : 25 Aug 2023 03:53PM

Photo Stories