Skip to main content

Chess Masters Cup: మాస్టర్స్‌ కప్‌ చెస్‌ టోర్నీ విజేత అర్జున్

భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ డబ్ల్యూఆర్‌ చెస్‌ మాస్టర్స్‌ కప్‌ టోర్నీలో చాంపియన్‌గా అవతరించాడు.
Arjun Erigaisi is the Winner of Masters Cup Chess Tournament

16 మంది క్రీడాకారుల మధ్య నాకౌట్‌ పద్ధతిలో ఈ టోర్నీ జరిగింది. ఫైనల్లో అర్జున్‌ ‘అర్మగెడాన్‌’ గేమ్‌లో ఫ్రాన్స్‌ గ్రాండ్‌మాస్టర్‌ మాక్సిమి లాషెర్‌ లగ్రేవ్‌పై విజయం సాధించాడు. అంతకుముందు వీరిద్దరి మధ్య జరిగిన రెండు గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. 

తొలి గేమ్‌ 30 ఎత్తుల్లో.. రెండో గేమ్‌ 38 ఎత్తుల్లో ‘డ్రా’ అయ్యాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘అర్మగెడాన్‌’ గేమ్‌ను నిర్వహించారు.  

అర్మగెడాన్‌ గేమ్‌లో లగ్రేవ్‌ తెల్లపావులతో, అర్జున్‌ నల్లపావులతో ఆడారు. అయితే అర్జున్‌ ఈ గేమ్‌ను ‘డ్రా’ చేసుకోకుండా 69 ఎత్తుల్లో లగ్రేవ్‌ను ఓడించారు. సెమీఫైనల్లో అర్జున్‌తో భారత్‌కే చెందిన ప్రజ్ఞానందపై, క్వార్టర్‌ ఫైనల్లో  విదిత్‌ సంతోష్‌ గుజరాతిపై గెలిచాడు. 

విజేతగా నిలిచిన అర్జున్‌కు 20 వేల యూరోలు (రూ.18 లక్షల 25 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. 

Kho Kho World Cup: భారత్‌లోనే.. తొలి ఖో ఖో వరల్డ్ కప్

Published date : 21 Oct 2024 09:55AM

Photo Stories