Akshdeep Singh: 20 కిలోమీటర్ల నడకలో అక్ష్‌దీప్ జాతీయ రికార్డు..
Sakshi Education
జాతీయ ఓపెన్ రేస్ వాకింగ్ చాంపియన్‌షిప్ పురుషుల 20 కిలోమీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డు నమోదైంది.
ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన పంజాబ్ అథ్లెట్ అక్ష్‌దీప్ సింగ్ జనవరి 30వ తేదీ (మంగళవారం) జరిగిన పోటీల్లో 20 కిలోమీటర్ల దూరాన్ని ఒక గంట 19 నిమిషాల 38 సెకన్లలో నడిచి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. ఒక గంట 19 నిమిషాల 55 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును అక్ష్ దీప్ బద్దలు కొట్టాడు.
సూరజ్ పన్వర్ (1గం:19ని.44 సెకన్లు; ఉత్తరాఖండ్) రెండో స్థానంలో, సెర్విన్ సెబాస్టియన్ (1గం:20.03 సెకన్లు; తమిళనాడు) మూడో స్థానంలో, అర్షప్రీత్ సింగ్ (1గం:20ని.04 సెకన్లు) నాలుగో స్థానంలో నిలిచారు. ఈ ముగ్గురు కూడా పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణ (1గం:20.10 సెకన్లు) సమయాన్ని అధిగమించారు. దాంతో పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత వాకర్ల సంఖ్య ఆరుకు చేరుకుంది.
ATP Rankings: నంబర్‌వన్ ర్యాంక్‌ను అధిరోహించిన రోహన్ బోపన్న..
Published date : 01 Feb 2024 10:28AM