ATP Rankings: నంబర్‌వన్ ర్యాంక్‌ను అధిరోహించిన రోహన్ బోపన్న..
జనవరి 29వ తేదీ విడుదల చేసిన అధికారిక తాజా ర్యాంకింగ్స్‌లో రోహన్ బోపన్న రెండు స్థానాలు ఎగబాకి తన కెరీర్‌లో తొలిసారి టాప్ ర్యాంక్‌లో నిలిచాడు.
టెన్నిస్ చరిత్రలోనే నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్న అతిపెద్ద వయస్కుడిగా బోపన్న (43 ఏళ్ల 330 రోజులు) ప్రపంచ రికార్డు సృష్టించాడు. అమెరికా దిగ్గజం మైక్ బ్రయాన్ (41 ఏళ్ల 76 రోజులు; 2019లో) పేరిట ఉన్న రికార్డును అతను బద్దలు కొట్టాడు. ఇటీవల ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో బోపన్న ఆ్రస్టేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి పురుషుల డబుల్స్ విభాగంలో టైటిల్ నెగ్గి తన కెరీర్‌లో పురుషుల డబుల్స్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
Oscar Nominations 2024: ఆస్కార్ నామినేషన్స్ 2024.. ఈసారి పోటీ పడుతున్న సినిమాలు ఇవే..!
ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో బోపన్న, ఎబ్డెన్ 8,450 పాయింట్లతో సమంగా ఉన్నప్పటికీ తక్కువ టోర్నీలు ఆడినందుకు బోపన్నకు టాప్ ర్యాంక్ ఖరారుకాగా, ఎబ్డెన్ రెండో ర్యాంక్‌లో నిలిచాడు. చివరిసారి భారత్ నుంచి లియాండర్ పేస్ 2000 మార్చి 13న, మహేశ్ భూపతి 1999 జూన్ 14న ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచారు.
బెంగళూరుకు చెందిన బోపన్న 2003లో ప్రొఫెషనల్‌గా మారాడు. తన 21 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో బోపన్న ఇప్పటిదాకా పురుషుల డబుల్స్‌లో 19 మంది వేర్వేరు భాగస్వాములతో ఆడి 25 టైటిల్స్ సాధించడంతోపాటు 504 మ్యాచ్‌ల్లో గెలుపొందాడు. 2016లో బెంగళూరులో తన పేరిట టెన్నిస్ అకాడమీని స్థాపించి కుర్రాళ్లకు శిక్షణ ఇస్తున్నాడు.