BrahMos: యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ ప్రయోగం
Sakshi Education
భారత రక్షణ రంగం మరింత బలోపేతమయ్యే దిశగా కీలక ముందడుగు పడింది. సుఖోయ్–30 యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ ఎక్స్‌టెండెడ్ రేంజ్ క్షిపణిని గురువారం బంగాళాఖాతంలో పరీక్షించారు.
బ్రహ్మోస్ ప్రయోగం విజయవంతమై 400 కి.మీ. దూరంలో ఉన్న నౌకను పేల్చేసింది. ‘‘భారత వాయుసేన సుఖోయ్ యుద్ధ విమానం నుంచి ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి నిర్దేశిత లక్ష్యాలను కచ్చితంగా ఛేదించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఉపరితలం, సముద్ర మార్గంలో సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం వైమానిక దళానికి లభించినట్టయింది’’ అని రక్షణ శాఖ వెల్లడించింది. యుద్ధ విమానం నుంచి సుఖోయ్‌ని ప్రయోగించడం ఇది తొలిసారి కాదు. ఈ ఏడాది మేలో సూపర్‌సోనిక్ మిస్సైల్ ఎక్స్‌టెండెండ్ వెర్షన్‌ను సుఖోయ్ యుద్ధ విమానం నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఇప్పుడు క్షిపణి పరిధిని 290 కిలోమీటర్ల స్థాయి నుంచి 400 కిలోమీటర్లకు పెంచారు.
Agni-5 Missile: అగ్ని5 క్షిపణి పరీక్ష సక్సెస్
Published date : 30 Dec 2022 03:33PM