Skip to main content

Agni-5 Missile: అగ్ని5 క్షిపణి పరీక్ష సక్సెస్‌

అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న అగ్ని–5 బాలిస్టిక్‌ క్షిపణిని భారత్ డిసెంబ‌ర్ 15న‌ విజయవంతంగా పరీక్షించింది.

ఒడిశా తీరంలో అబ్దుల్‌ కలాం దీవి నుంచి ఈ ప్రయోగం చేప‌ట్టారు. అగ్ని–2 క్షిపణి సామర్థ్యం 2 వేల కిలోమీటర్లు కాగా తాజాగా అభివృద్ధి పరిచిన అగ్ని–5 క్షిపణి 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో చేపట్టిన ఈ ప్రయోగం.. దేశ వ్యూహాత్మక పోరాట సామర్థ్యాన్ని చాటుతుందని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. జూన్‌లో రాత్రివేళ చేపట్టిన అగ్ని–4 బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది.  

Vikram S Rocket: భారత అంతరిక్షయాన రంగంలో చారిత్రక ఘట్టం తొలి ప్రైవేటు రాకెట్‌ ప్రయోగం సక్సెస్‌

Published date : 16 Dec 2022 11:53AM

Photo Stories