Vikram S Rocket: భారత అంతరిక్షయాన రంగంలో చారిత్రక ఘట్టం తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగం సక్సెస్
తిరుపతి జిల్లాలోని సతీశ్‌ధావన్ స్పేస్‌సెంటర్ షార్ నుంచి నవంబర్ 18న ఉదయం 11.30 గంటలకు విక్రమ్ ఎస్ రాకెట్ నింగిలోకి వెళ్లింది. హైదరాబాద్‌కి చెందిన స్పేస్ స్టార్టప్ అయిన స్కైరూట్ ఏరోస్పేస్ ఈ రాకెట్‌ను రూపొందించింది. విక్రమ్ సారాభాయ్ పేరుమీద దీనికి విక్రమ్ ఎస్ అని నామకరణం చేశారు. దీని పొడవు 6 మీటర్లు కాగా, బరువు 545 కిలోలు. ఇది రెండు భారతీయ, ఒక విదేశీ పేలోడ్లను కక్ష్యలోకి తీసుకెళ్లింది. వాటిలో భారత్, అమెరికా, సింగపూర్, ఇండోనేషియాకు చెందిన విద్యార్థులు అభివృద్ధి చేసిన 2.5 కిలోల పేలోడ్ అయిన ఫన్–శాట్ కూడా ఉంది. ఈ మిషన్ ద్వారా దేశంలో అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించిన తొలి ప్రైవేట్ అంతరిక్ష సంస్థగా స్కైరూట్ అవతరించింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP