World's First Portable Hospital : ప్రపంచంలో తొలి పోర్టబుల్ హాస్పిటల్..
Sakshi Education
భారత ఆర్మీ, వాయుసేన సంయుక్తంగా ఒక ప్రతిష్టాత్మక ఆపరేషన్ చేపట్టాయి.
భారత ఆర్మీ, వాయుసేన సంయుక్తంగా ఒక ప్రతిష్టాత్మక ఆపరేషన్ చేపట్టాయి. ప్రపంచంలోనే మొదటి ‘పోర్టబుల్ హాస్పిటల్’ను విజయవంతంగా ఒక మారుమూల ప్రాంతానికి డెలివరీ చేశాయి. సొంతంగా తయారు చేసిన ఈ పోర్టబుల్ హాస్పిటల్‌ను 15 వేల అడుగుల ఎత్తు నుంచి ఐఏఎఫ్‌కు చెందిన రవాణా విమానం ద్వారా అనుకొన్న లక్షిత ప్రాంతంలో ప్యారాచూట్ సాయంతో జారవిడిచినట్టు రక్షణ శాఖ వర్గాలు శనివారం వెల్లడించాయి.
Pilot Project : పైలట్ ప్రాజెక్టుకు జన్‌పోషన్ కేంద్రాలుగా రేషన్ షాపులు..
ఈ ఆపరేషన్‌లో ట్రామా కేర్ తదితర సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్‌లను తరలించారు. ఈ పోర్టబుల్ హాస్పిటల్‌ను తరలించేందుకు ఐఏఎఫ్ అధునాతన సీ 1 30 జే సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాన్ని భారత వాయుసేనా వినియోగించింది.
Published date : 26 Aug 2024 12:41PM