Skip to main content

DRDO: స్వదేశీ క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

భారతదేశం దేశీయంగా అభివృద్ధి చేసిన ఇండిజినస్ టెక్నాలజీ క్రూయిజ్ మిస్సైల్(ఐటీసీఎం)ను విజయవంతంగా పరీక్షించింది.
Missile Launch  Indian Missile Test  DRDO successfully test fires indigenous long range subsonic cruise missile

ఈ పరీక్ష ఏప్రిల్ 18వ తేదీన ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి జరిగింది.

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ప్రకారం ఈ పరీక్షలో క్షిపణి యొక్క అన్ని ఉపవ్యవస్థలు అంచనాలకు అనుగుణంగా పనిచేశాయి.

క్షిపణి ప్రయాణ మార్గంలో ఏర్పాటు చేసిన రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్, టెలిమెట్రీ వంటి సెన్సార్ల ద్వారా పనితీరును అంచనా వేసినట్లు పేర్కొంది. దీంతోపాటు, వాయుసేనకు చెందిన ఎస్‌యూ–30 ఎంకే–ఐ విమానం ద్వారా కూడా క్షిపణి ప్రయాణం తీరును అంచనా వేసినట్లు డీఆర్‌డీవో వివరించింది. 

Angara-A5 Rocket: అంగారా-A5 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన రష్యా

Published date : 19 Apr 2024 05:41PM

Photo Stories