Skip to main content

Aditya-L1 mission: ఆదిత్య –ఎల్‌1 మార్గాన్ని చక్కదిద్దిన ఇస్రో

సూర్యశోధనకు ఉద్దేశించిన ఆదిత్య –ఎల్‌1 ఉపగ్రహ ప్రయోగంలో మరో కీలక దశను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది.
Aditya-L1 mission, isro news, SunStudyMission
Aditya-L1 mission

దాని మార్గాన్ని సరిదిద్దే ప్రక్రియను సజావుగా జరిపినట్టు ఆదివారం ప్రకటించింది. అక్టోబర్‌ 6న 16 సెకన్ల పాటు ఇది కొనసాగిందని వివరించింది. లగ్రాంజ్‌ పాయింట్‌1 వైపు ఉపగ్రహం నిర్దేశిత మార్గంలో సాగేలా ఉంచేందుకు ఈ ప్రక్రియ తోడ్పడుతుంది.

Adiltya L1 Mission: గురుత్వాకర్షణ పరిధిని దాటి..లాగ్రాంజ్‌ పాయింట్ వైపుగా ఆదిత్య–ఎల్‌1

ఆదిత్య –ఎల్‌1 సూర్యునిపైకి భారత తొలి ప్రయోగం. దీన్ని సెప్టెంబర్‌ 2న శ్రీహరికోట నుంచి జరిపారు. తర్వాత దాని గమనాన్ని సెప్టెంబర్‌ 19న లగ్రాంజియన్‌ పాయింట్‌ కేసి నిర్దేశించారు. తాజా ప్రయత్నం ద్వారా దాన్ని మరింతగా సరిచేశారు.  125 రోజుల పాటు భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఆదిత్య–ఎల్‌1ను సూర్యునికి అతి సన్నిహితమైన హాలో కక్ష్యలోకి ప్రవేశపెట్టాలన్నది ఇస్రో లక్ష్యం.  

ISRO plans to build space station: అంతరిక్ష కేంద్రం ఏర్పాటు దిశ‌గా ఇస్రో

Published date : 10 Oct 2023 11:10AM

Photo Stories