Lunar Water: చందమామపై నీటి జాడలు ఉన్నాయా?
Sakshi Education
చైనా శాస్త్రవేత్తలు చందమామపై నీటి ఆనవాళ్లు ఉన్నది నిజమేనని చెబుతున్నారు.
జాబిల్లి నుంచి తీసుకొచ్చిన మట్టి నమూనాలను పరీక్షించగా, జలం జాడ కనిపించిందని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్(సీఏఎస్) వెల్లడించింది.
చైనా 2020లో ప్రయోగించిన చాంగే–5 స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి నుంచి మట్టి నమూనాలను తీసుకొచ్చింది. దాదాపు 2 కిలోల మట్టి, రాళ్ల నమూనాలను భూమిపైకి చేర్చింది. వీటిపై చైనా సైంటిస్టులు పరీక్షలు చేస్తున్నారు. ఈ నమూనాల్లో భారీ స్థాయిలో నీటి అణువులు ఉన్నట్లు గుర్తించారు. 2009లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన చంద్రయాన్–1 స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడిపై నీటి ఆనవాళ్లు ఉన్నట్లు కనిపెట్టింది.
దీంతో.. చైనా, భారతదేశాల అంతరిక్ష పరిశోధన సంస్థల పరిశోధనలు చంద్రుడిపై నీటి అణువులు ఉన్నాయని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
Apollo 11 Mission: అందరాని చందమామను మానవాళి సగర్వంగా అందుకున్న రోజు ఇదే..
Published date : 25 Jul 2024 03:37PM