Adiltya L1 Mission: గురుత్వాకర్షణ పరిధిని దాటి..లాగ్రాంజ్ పాయింట్ వైపుగా ఆదిత్య–ఎల్1
Sakshi Education
సూర్యుడిపై పరిశోధనలే లక్ష్యంగా ప్రయోగించిన ఆదిత్య–ఎల్1 ఉపగ్రహం భూమికి 9.2 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయా ణించి, భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసిందని ఇస్రో తెలిపింది.
ప్రస్తుతం అది లాగ్రాంజ్ పాయింట్ దిశగా ప్రయాణం సాగిస్తోందని శనివారం ‘ఎక్స్’లో వెల్లడించింది. ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్పీ– సి57 రాకెట్ ద్వారా సెప్టెంబర్ 2వ తేదీన శ్రీహరి కోట నుంచి ప్రయోగించిన విషయం తెలిసిందే.
Aditya L1 Mission Launch Live updates: ఆదిత్య–ఎల్1 ప్రయోగం విజయవంతం
Published date : 02 Oct 2023 03:51PM