Skip to main content

Aditya-L1 Mission: సౌర గాలులను ఆధ్యయనం చేస్తున్న ఆదిత్య ఎల్‌–1

సూర్యుడిపై లోతైన అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్‌–1 వ్యోమనౌక మరో మైలురాయిని సాధించింది.
Solar Wind Particle Experiment on Aditya Satellite  Isro activated second instrument on Indian solar spacecraft  ISRO's ASPEX Payload Begins Operations on Aditya
Isro activated second instrument on Indian solar spacecraft

 ఆదిత్య ఉపగ్రహంలోని సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పరిమెంట్ (ASPEX) పేలోడ్ తన కార్యకలాపాలను​ ప్రారంభించిందని ఇస్రో తాజాగా వెల్లడించింది. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం ఆదిత్య ఎల్​1 ఉపగ్రహం లోని రెండు పరికరాలు పరిశోధనలన విజయవంతంగా కొనసాగిస్తున్నాయని, సౌర గాలులను ఆధ్యయనం చేస్తున్నాయని తెలిపింది.

 

Aditya L1 Mission Launch Live updates: ఆదిత్య–ఎల్‌1 ప్ర‌యోగం విజ‌య‌వంతం

ఆదిత్య పేలోడ్ ప‌రిక‌రం తీసిన ఫోటోను ఇస్రో త‌న ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేసింది. ప్రోటాన్‌, ఆల్ఫా పార్టిక‌ల్స్‌లో ఉన్న ఎన‌ర్జీ తేడాల‌ను ఈ ఫోటోలో గ‌మ‌నించ‌వ‌చ్చు. రెండు రోజుల్లో ప్రోటాన్‌, ఆల్ఫా పార్టిక‌ల్ కౌంట్‌లో తేడా ఉన్న‌ట్లు ఆదిత్య శాటిలైట్ గుర్తించిన‌ట్లు తెలుస్తోంది.

solar winds

కాగా ఆదిత్య సోలార్​ విండ్​ పార్టికల్​ ఎక్స్​పరిమెంట్​ పేలోడ్​లో రెండు పరికరాలు ఉన్నాయి. ఇందులోని సోలర్​ విండ్​ అయాన్ స్పెక్ట్రోమీటర్ (Swis) నవంబర్​2న,  సుప్రా థర్మల్ ఎనర్జిటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్ (Steps) సెప్టెంబర్​ 10న యాక్టివేట్​ చేశారు. ఇవి రెండు మెరుగైన పనితీరును ప్రదర్శిస్తున్నాయని ఇస్రో పేర్కొంది. 

స్విస్​లో ఉన్న రెండు సెన్సర్లు 360 డిగ్రీల్లో తిరుగుతూ పనిచేస్తున్నాయి. ఇవి నవంబరులోని రెండు తేదిల్లో సోలార్​ విండ్​ అయాన్లు, ప్రోటాన్స్​, ఆల్ఫా పార్టికల్స్​ను విశ్లేషించినట్లు ఇస్రో పేర్కొంది. ఈ సెన్సర్​ సేకరించిన ఎనర్జీ హస్టోగ్రామ్​ను పరిశీలించిన తర్వాత.. ప్రోటాన్​, ఆల్ఫా పార్టికల్స్​లో కొన్ని తేడా ఉనట్లు శాటిలైట్గు​  ఇస్రో పేర్కొంది.

Aditya-L1: సౌర జ్వాలలను రికార్డ్ చేసిన ఆదిత్య ఎల్1

 

Published date : 04 Dec 2023 09:53AM

Photo Stories