Ballistic Missile: ఫేస్ 2 బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ పరీక్ష విజయవంతం
పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో ఈ వ్యవస్థను అభివృద్ధి చేశారు. రెండో(ఫేజ్2) ప్రయోగ దశలో ఉన్న మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో పరీక్షంచారు. వ్యవస్థ అన్ని పరామితులను ఖచ్చితత్వంతో సాధించిందని రక్షణ శాఖ జూలై 24వ తేదీ ఒక ప్రకటనలో పేర్కొంది. ముందుగా శత్రు క్షిపణి మాదిరిగా ఒక డమ్మీ క్షిపణిని మధ్యాహ్నం 4.20 గంటలకు ప్రయోగించారు.
గగనతలం, సముద్రతలంపై మొహరించిన సాయుధ రాడార్లు వెంటనే ఈ శత్రు క్షిపణి దిశను గుర్తించిన ఇంటర్‌సెసటార్ వ్యవస్థను క్రియాశీలం చేశాయి. ఇందులోని ఫేస్2 ఏడీ ఎండో, అట్మాస్ఫిరిక్ క్షపణి బయల్దేరి.. శత్రు క్షిపణిని విజయవంతంగా అడ్డుకుంది.
ఫేజ్-II ఏడీ ఎండో-అట్మాస్పియరిక్ క్షిపణి దేశీయంగా అభివృద్ధి చేయబడిన రెండు-దశల సాలిడ్-ప్రొపెల్డ్ గ్రౌండ్-లాంచ్డ్ క్షిపణి వ్యవస్థ.