Jagananna Gorumudda: జగనన్న గోరుముద్దకు జాతీయ స్థాయిలో గుర్తింపు
Sakshi Education
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు ‘జగనన్న గోరుముద్ద’ పేరిట పౌష్టికాహారం అందిస్తున్న కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
కౌమార దశ విద్యార్థుల్లో రక్తహీనత నివారణ కోసం చేస్తున్న విశేష సేవలకు జాతీయస్థాయి ప్రథమ బహుమతిని ఏపీకి అందజేసింది. అవార్డును స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ జోయా అలీ రిజ్వీ చేతుల మీదుగా బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఏపీ పాఠశాల విద్యాశాఖ నోడల్ ఆఫీసర్ పి.హేమారాణి, ఆరోగ్య శాఖ నోడల్ అధికారి దేవి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నోడల్ ఆఫీసర్ ఎన్.శ్రీదేవి అందుకున్నారు.
Published date : 23 Nov 2023 12:42PM