Skip to main content

Human Rights Commission: ఏపీ హెచ్‌ఆర్‌సీ కార్యాలయం ఏ నగరంలో ఏర్పాటైంది?

రాయలసీమ ముఖద్వారం(గేట్‌వే ఆఫ్‌ రాయలసీమ) కర్నూలు నగరంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్‌సీ) ఏర్పాటైంది.
AP HRC-Kurnool

నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని సెప్టెంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హెచ్‌ఆర్సీ చైర్మన్‌ జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి ప్రారంభించారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లయితే.. ప్రతి ఒక్కరూ కమిషన్‌ను ఆశ్రయించి న్యాయం పొందాలని జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి సూచించారు.

ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం
ఐక్యరాజ్యసమితి 1948లో యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ (యూడీహెచ్‌ఆర్‌)ను ఆమోదించగా.. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా డిసెంబర్‌ 10వ తేదీని మానవ హక్కుల దినంగా పాటిస్తున్నారు. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడంకోసం కోర్టులతోపాటు మానవ హక్కుల కమిషన్‌లు ఏర్పాటుచేయబడ్డాయి.

కార్యక్రమాలు

  • 2008 డిసెంబరు 10న యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ 60వ వార్షికోత్సవం జరిగింది. యునైటెడ్‌ నేషన్స్‌ సెక్రటరీ జనరల్‌ ఆ ఏడాది అంతా మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన ప్రణాళికలు, ఉపన్యాసాలతో సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. యు.డి.హెచ్‌.ఆర్‌ రూపొందించిన డాక్యుమెంట్‌ 360 భాషల్లోకి అనువాదమై ప్రపంచ రికార్డు సాధించింది.
  • 1998లో మాల్దావా ఫిఫ్టీ ఇయర్స్‌ ఆఫ్‌ ది యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ అంటూ ఒక పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. తైవాన్‌ లో షియా మింగ్‌–టెహ్‌ 1979లో హ్యూమన్‌ రైట్స్‌ ప్రదర్శనలు నిర్వహించింది.  

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్‌సీ) కార్యాలయం ప్రారంభం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 1
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హెచ్‌ఆర్సీ చైర్మన్‌ జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి
ఎక్కడ    : కర్నూలు, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు  : మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లయితే.. ప్రతి ఒక్కరూ కమిషన్‌ను ఆశ్రయించి న్యాయం పొందాలని...
 

Published date : 02 Sep 2021 05:29PM

Photo Stories