ISRO: ఇస్రోలో నంద్యాల జిల్లా వాసి
బేతంచెర్ల పట్టణానికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి ముళ్ల మీరం సాహెబ్, వాహిదా దంపతుల పెద్ద కుమారుడు డాక్టర్ సలీం బాషా ప్రస్తుతం ఇస్రోలో శాస్త్రవేత్తగా సేవలు అందిస్తున్నారు.ఈయన 5వ తరగతి వరకు పట్టణంలోని సర్వస్వతి విద్యామందిర్, ఆ తర్వాత శేషారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేశాడు. అనంతపురం జేఎన్టీయూ పాలిటెక్నిక్, జేఎన్టీయూ హైదరాబాద్ విశ్వ విద్యాలయంలో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. 2006లో ఇస్రోలో జాయిన్ అయ్యి ఉద్యోగం చేస్తూ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో పీహెచ్‌డీ డాక్టరేట్ 2021 పొందారు.
Who is TATA's Business Successor: 'టాటా' వ్యాపార సామ్రాజ్యానికి వారసులు ఎవరు?
ప్రస్తుతం లీడ్ సైంటిస్టుగా ఇస్రోలో కొనసాగుతున్నారు. ఎన్నో ఇస్రో మిషన్స్‌లో పాత్ర పోషించిన సలీం బాషా చంద్రయాన్ –2, చంద్రయాన్–3లో థర్మల్ డిజైనింగ్ లీడ్ సైంటిస్టుగా పాత్ర పోషించారు. దేశం కోసం కొత్త ఆవిష్కరణలు సృష్టిస్తున్న శాస్త్రవేత్తల్లో బేతంచెర్ల వాసి ఉండటంతో అతని కుటుంబ సభ్యులు మహబూబ్ బాషా, ఉసేన్ బాషా, రూహిద్ అక్రం, వాసిమ్ అక్రమ్‌తో పాటు పట్టణ ప్రజలు, పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Infosys Brand Ambassador: ఇన్ఫోసిస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా రఫేల్ నాదల్