Miss Teen Globe India: మిస్ టీన్ గ్లోబల్ ఇండియా విజేత సంజన
Sakshi Education
జైపూర్‌లో స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్‌కి చెందిన ది పేజెంట్ స్టార్ మిస్ టీన్ ఇండియా నిర్వహించిన ఈవెంట్ మిస్ టీన్ గ్లోబల్ ఇండియా–2024 టైటిల్‌ను చంద్రగిరికి చెందిన ఆలత్తూరు పావని, సుబ్రమణ్యం కుమార్తె సంజన వరద(18) గెలుచుకున్నారు.
![Miss Teen Globe India 2024 winner Sanjana Varada](/sites/default/files/images/2024/05/20/miss-teen-1716184142.jpg)
మే 7 నుంచి 12వ తేదీ వరకు మలేసియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన మిస్ టీన్ గ్లోబల్–2024 పోటీలో భారత్‌కు సంజన వరద ప్రాతినిథ్యం వహించింది.
ఈ పోటీల్లో ఆమె 1వ రన్నరప్‌గా నిలిచింది. సంజన బెంగళూరులో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతూ గతంలో జాతీయస్థాయిలో అవార్డును గెలుచుకుంది. ఈ ప్రతిష్టాత్మక విజయంతోపాటు, సంజన వరద సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్స్ అవార్డు, పాపులర్ అవార్డును కూడా అందుకుంది.
ఇంకా ఆమె తన పిత్తా ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు సహాయం చేయడంలో చేసిన కృషికి అత్యుత్తమమైన దాతృత్వ అవార్డుతో గ్లోబల్ సంస్థ సత్కరించింది. అంతర్జాతీయ స్థాయిలో మిస్ ఇండియా కీరీటాన్ని సాధించడమే తన ధ్యేయమని, దానికోసమే కష్టపడతానని స్టార్ మిస్ టీన్ ఇండియా గ్రహీత సంజన వరద అన్నారు.
Megastar Chiranjeevi: పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి..
Published date : 20 May 2024 11:19AM