Skip to main content

LK Advani Honoured With Bharat Ratna: అద్వానీకి భారతరత్న పురస్కారం..

LK Advani Honoured With Bharat Ratna    Lal Krishna Advani receiving Bharat Ratna award from President Draupadi Murmu
LK Advani Honoured With Bharat Ratna

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ దిగ్గజం, మాజీ ఉప ప్రధాని లాల్‌ కృష్ణ అద్వానీ (96) భారత రత్న పురస్కారం అందుకున్నారు. ఆదివారం ఢిల్లీలోని అద్వానీ నివాసంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనకు పురస్కారాన్ని అందజేశారు.

ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. అద్వానీకి భారతరత్న ప్రదాన కార్యక్రమంలో పాల్గొనడం తనకు చాలా ప్రత్యేకమైన సందర్భమని మోదీ అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. భారతరత్న ప్రదాన సమయంలో కూర్చోని ఉండటం ద్వారా రాష్ట్రపతిని మోదీ ఘోరంగా అవమానించారని కాంగ్రెస్‌ మండిపడింది.

 

Published date : 01 Apr 2024 10:58AM

Photo Stories