Kamla Beniwal: మాజీ గవర్నర్ కమలా బెనివాల్ కన్నుమూత
Sakshi Education
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గుజరాత్ మాజీ గవర్నర్ కమలా బెనివాల్ (97) మే 15వ తేదీ మరణించారు.
జైపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
కమలా బెనివాల్ గుజరాత్‌తో పాటు త్రిపుర, మిజోరం రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బెనివాల్ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలో ఇతర పదవులను నిర్వహించడమే కాకుండా రాజస్థాన్ డిప్యూటీ సీఎంగా పనిచేశారు. బేనివాల్ తన అచంచల నిబద్ధత, దశాబ్దాల సుదీర్ఘ సేవలతో దేశ రాజకీయ రంగంలో చెరగని ముద్ర వేశారు.
స్వాతంత్య్ర సమరానికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా బెనివాల్ తామ్రా పాత్ర అవార్డును అందుకున్నారు. 2009 అక్టోబర్‌లో త్రిపుర గవర్నర్‌గా నియమితులైన ఆమె ఈశాన్య భారతదేశంలోని రాష్ట్రాల్లో మొదటి మహిళా గవర్నర్‌గా గుర్తింపు పొందారు.
Maria Feliciana: ప్రపంచంలోనే అతిపొడవైన మహిళ కన్నుమూత.. ఈమె గాయని, బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి కూడా..
Published date : 17 May 2024 06:55PM