Srinivas Hegde: చంద్రయాన్-1 మిషన్ డైరెక్టర్ శ్రీనివాస్ హెగ్డే కన్నుమూత
Sakshi Education
భారతదేశానికి చెందిన చంద్రయాన్-1 మిషన్ డైరెక్టర్ శ్రీనివాస్ హెగ్డే జూన్ 14వ తేదీ బెంగళూరులో కన్నుమూశారు.
శ్రీనివాస్ హెగ్డే మూడు దశాబ్దాలకు పైగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో పనిచేశారు.
ఆయన 1978 నుంచి 2014 వరకు అంతరిక్ష సంస్థ నిర్వహించిన అనేక చారిత్రాత్మక మిషన్లలో కీలక పాత్ర పోషించారు. వాటిలో ముఖ్యమైనది 2008లో చేపట్టిన చంద్రయాన్-1. ఇది చంద్రునిపై నీటి అణువులను గుర్తించింది. శ్రీనివాస్ హెగ్డే పదవీ విరమణ అనంతరం బెంగళూరుకు చెందిన స్టార్టప్ టీమ్ ఇండస్‌లో చేరారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Published date : 15 Jun 2024 03:29PM
Tags
- Srinivas Hegde
- Chandrayaan 1 Director
- Former ISRO scientist
- ISRO Scientist
- UR Rao Satellite Centre
- India’s first moon mission
- moon mission
- ISRO
- Indian Space Research Organisation
- SakshiEducationUpdates
- Indian Space Research Organization
- Indian space missions
- Mission director
- Chandrayaan-1 mission
- June14th